ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 160కు పైగా సీట్లు గెలుచుకుంటాం : చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ పార్టీల కూటమి 160కి పైగా సీట్లను గెలుచుకుంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు ప్రధానమంత్రి బాధ్యతలు చేపడుతారన్నారు. అలాగే, ఏపీలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ఇది నవశకానికి ఆవిర్భావమన్నారు. గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్మిస్తామన్నారు. 
 
కాగా, వచ్చే ఎన్నికల్లో అధికార వైకాపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే ఇప్పటి నుంచే ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, ఈ కారణంగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, హింసా రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మునయ్య, నంద్యాలలో ఇమామ్‌లను వైకాపా గూండాలు హత్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముగ్గురు ఎస్పీల అండతోనే వైకాపా గూండాలు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఆ ఎస్పీలు పరమేశ్వర రెడ్డి, రఘువీర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలు వైకాపా అనుకూలంగా పని చేస్తున్నారన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదానికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు. 
 
కాగా, ఏపీ అసెంబ్లీలోని 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే, జనసేన పార్టీ 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తుంది. టీడీపీ స్థానాల్లో ఇప్పటివరకు 128 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి మరికొందరి పేర్లు వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments