Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ముగిసిన పోలింగ్... ఏపీలో బారులు తీరిన వృద్ధులు - మహిళలు

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:56 IST)
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ గురువారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు దేశ వ్యాప్తంగా 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ముగిసింది. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల కంటే రెండు గంటలు ముందుగానే పోలింగ్ ముగించారు. నాలుగు గంటల లోపు క్యూలో ఉన్నఓటర్లను ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. 
 
కాగా, ఏపీలోని మిగిలిన నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరివున్నారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో నిలబడిన ఓటర్లలో చివరి ఓటరు ఓటు వేసేంత వరకు పోలింగ్ కొనసాగుతుంది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగిసింది. ఒక్క నిజామాబాద్ స్థానంలో మాత్రం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ స్థానంలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments