Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన గుర్తు మారిందా? సోషల్ మీడియాలో వైరల్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (16:08 IST)
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి కేంద్ర ఎన్నిల సంఘం గ్లాజు గాజు గుర్తును కేటాయించింది. ఈ గుర్తుకు ఓటేయాలంటూ ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన గుర్తు మారిదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ఓ ప్రచారం సాగుతోంది. గాజు గ్లాసు గుర్తుకు బదులుగా బ్లేడు గుర్తును కేటాయించారనే ప్రచారం సాగుతోంది. ఇది నిజమా అన్నట్లు చేసిన క్రియేవిటీ అందర్నీ డైలమాలో పడేసింది.
 
ఇందుకోసం జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ కాపీని డూప్లికేట్ చేశారు. ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి అయిన పి.హరిప్రసాద్ పేరుతో ఈ విధంగా రాశారు. గాజు గ్లాసు గుర్తుపై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల సంఘం మనకు తాత్కాలికంగా బ్లేడు గుర్తును కేటాయించడం జరిగింది. కావును బ్లేడు గుర్తును విరివిగా ప్రచారం చేయమని మనవి. బ్లేడు గుర్తుకే మన ఓటు. ఇట్లు పి.హరిప్రసాద్ పేరుతో పాటు అతని సంతకంతో ఈ లేఖ విడుదల అయినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లెటర్ హెడ్‌లోనే బ్లేడు గుర్తుకే మన ఓటు అని పెద్ద అక్షరాలతోపాటు బ్లేడు సింబల్ వేశారు. చాలా మంది ఈ వార్తపై కన్ఫ్యూజ్ అవుతున్నారు.
 
నిజమా అని బయట వ్యక్తులు.. మీడియా మిత్రులకు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు అంటే.. ఎంతలా కన్ఫ్యూజ్ అయ్యారో ఈ వార్తతో అనేది స్పష్టం అవుతుంది. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. జనసేన కార్యకర్తలు ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని కోరారు. గుర్తు మారలేదని అధికారికంగా జనసేన పార్టీ వివరణ ఇచ్చింది. లేఖ విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments