Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపడమో.. చావడమో... జగన్ కనుసైగ చేస్తే : నోరుజారిన వైకాపా అభ్యర్థి

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (11:08 IST)
ఏపీ శాసనసభ ఎన్నికల్లో భాగంగా, నెల్లూరు పట్టణ అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా వైకాపా తరపున పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ నోరు జారారు. ఈ ఎన్నికల తర్వాత వైకాపా జెండా ఎగరాల్సిందేనంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్న సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా ఆవేశానికి గురయ్యారు. ఆయన నిగ్రహం కోల్పోయి నోరుజారారు. ఈ ఎన్నికల్లో చంపడమో... చావడో.. విజయమో.. వీరస్వర్గమో తేలిపోవాలన్నారు. జగన్ కనుసైగ చేస్తే నిమిషాల్లో అంతా కనుమరుగైపోతారని హెచ్చరించారు.
 
పార్టీ శ్రేణుల సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను టీడీపీ నేతలు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి  దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు, నెల్లూరు సిటీ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి. నారాయణ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో అనిల్ కుమార్ యాదవ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే ఆయన నిగ్రహం కోల్పోయి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments