Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి వచ్చేసింది బాబోయ్.. చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (10:14 IST)
రుతువులు మారేకొద్దీ, చర్మపు స్థితిగతులూ మారుతుంటాయి. శీతాకాలంలో అయితే మృతకణాలన్నీ శరీరం మీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే.. అవి అలానే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారి తీస్తాయి.

అందుకే.. బాడీ సాల్ట్ ద్వారా గానీ, షుగర్ స్క్ర‌బ్‌ల ద్వారా గానీ, శరీరం మీద నిలిచి ఉన్న మృతకణాలను తొలగించుకోవాలి. ఇలా చేయడం వలన మృతకణాలు తొలగిపోవడమే కాకుండా.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

మృతకణాలను తొలగించేందుకు అవసరమైన మిశ్రమాన్ని స్వయంగానే తయారుచేసుకోవచ్చు. అందుకు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, ఆలివ్ నూనె, కొన్ని ల్యావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్ చుక్కలు కలిపి ఈ మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు.
 
కేవలం ఆలివ్ నూనె, కొబ్బరినూనెతో మర్దన చేసినా చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్ ద్వారా గానీ, క్రీమ్ ద్వారా గానీ సున్నితంగా మర్దన చేయాలి. బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, 3 స్పూన్ల కొబ్బరినూనె కలిపి, స్వయంగానే కండీషనర్‌ను తయారుచేసుకుని వాడుకోవచ్చు.
 
రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తరచూ తింటూ ఉండాలి. శరీరానికి అవసరమైన కొవ్వు లభించే, అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, చేపలు, ముడిధాన్యాలు తరచు తినాలి. ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా, వేసవిలో ఏ సమస్యలకు గురికాకుండా చర్మం చక్కని నిగారింపుతో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

తర్వాతి కథనం
Show comments