Webdunia - Bharat's app for daily news and videos

Install App

తడిజుట్టుతోనే బ్యాండ్‌లు వేస్తున్నారా.. జుట్టు పెళుసుగా..?

చాలామంది వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు పొడిబారినట్లవుతుంది. దీంతో వెంట్రుకలు ఎక్కువగా రాలుతాయి. తలస్నానం చేసిన తరువాత ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. తలస్నానం చేసిన తరువాత టవల్‌తో జుట్టును

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:24 IST)
చాలామంది వారానికి రెండుమూడుసార్లు తలస్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వలన జుట్టు పొడిబారినట్లవుతుంది. దీంతో వెంట్రుకలు ఎక్కువగా రాలుతాయి. తలస్నానం చేసిన తరువాత ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. తలస్నానం చేసిన తరువాత టవల్‌తో జుట్టును బాగా తుడుచుకోవాలి. 
 
తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్ వాడాలి. దీంతో జుట్టు పొడిబారకుండా కాంతివంతంగా మారుతుంది. తడిజుట్టును దువ్వెనతో దువ్వడం వలన కూడా వెంట్రుకలు అధికంగా రాలిపోతాయి. తలస్నానం చేసిన తరువాత వేళ్లతోనే చిక్కుల్ని తీసుకుంటే జుట్టు రాలే సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కొంతమంది తలస్నానం చేసిన తరువాత హెయిర్ డ్రైయర్ వాడుతుంటారు.  
 
ఈ హెయిర్ డ్రైయర్ వాడడం వలన చుండ్రు ఎక్కువగా వస్తుంది. దాంతో వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. తడిగా ఉన్న జుట్టును ఆరకుండానే బ్యాండ్‌లు, క్లిప్పులు వేస్తుంటారు. బ్యాండ్లను సాగే విధంగా వేసుకుంటుంటారు. ఇలా సాగే బ్యాండ్లు వేసుకోవడం వలన జుట్టును పెళుసుగా చేసి వెంట్రుకలపై ప్రభావం చూపుతాయి. తద్వారా చుండ్రుతో పాటు జుట్టు రాలే సమస్యలు అధికమవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments