Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ రోజుకు 5 గంటలే కూర్చోండి లేదా 2గంటలకోసారి 5 నిమిషాలు నడవండి

Webdunia
సోమవారం, 28 సెప్టెంబరు 2015 (16:05 IST)
రోజూ గంటల పాటు కూర్చుంటున్నారా? వాహనాలు నడపడం, టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వంటివి గుండెకు హాని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజు మొత్తంలో 5 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చోవడం ద్వారా గుండె జబ్బులు పెరిగే ఆస్కారం ఉందని వారు హెచ్చరించారు. దీనికి చెక్ పెట్టాలంటే.. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. 
 
నిత్యం చేసే వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే చాలు గుండె జబ్బులు దరిచేరవనుకోవడం సబబు కాదు. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. పీకల దాకా తాగితే.. ఆక్సీకరణ చేయడానికి.. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కూడా చాలా ఎక్కువ సేపు పని చేయాల్సి వుంటుంది. దీంతో గుండె సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె సమస్యలతో పాటు కోపం, చిరాకు, నిద్రలేమి, దంత సమస్యలు ఉత్పన్నమవుతాయి.
 
గత నాలుగేళ్లలో హృద్రోగ వ్యాధులతో మృతి చెందే మహిళల శాతం అధికంగా ఉందని అమెరికన్ హాస్పిటల్ అసోసియేషన్ గైడ్‌లైన్స్ పేర్కొంది. ఇందుకు ఉద్యోగాలు చేసే మహిళల శాతం పెరగడం ఒక కారణమని.. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు అధికమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. 
 
అందుచేత మహిళలు గంటల పాటు కూర్చోవడం తగ్గించాలి. రాత్రిపూట హాయిగా నిద్రపోవాలి. రోజుకు 8 గంటల నిద్ర అవసరం. రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇంకా హృద్రోగ వ్యాధుల్ని దూరం చేసుకోవాలంటే.. హాలి డే ట్రిప్ వేసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో సెలవు దొరికితే హాలిడే ట్రిప్ ప్లాన్ చేసే వారిలో 30శాతం హృద్రోగ వ్యాధులు తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments