Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల్లోకన్నా మహిళల్లోనే జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ!!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (11:24 IST)
పురుషులకన్నా మహిళల్లోనే జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఏదైనా అంశంపై గుర్తుంచుకునేందుకు పురుషులకన్నా మహిళలే ఎక్కువగా గుర్తుంచుకుంటారని తమ  పరిశోధనల్లో తేలిందని యూనివర్శిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. 
 
పురుషుల్లో వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, అదే మహిళల్లో వయసుతోపాటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని తమ పరిశోధనల్లో తేలిందని వారు వెల్లడించారు. పురుషులు, మహిళల్లో జ్ఞాపకశక్తిని అంచనా వేసేందుకు 50 సంవత్సరాలకన్నా ఎక్కువగానున్న వయసు కలిగిన పది వేలమందిని తాము అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు.  
 
తమ పరిశోధనల్లో వారి స్మరణశక్తి సామర్థ్యాన్ని పరిశీలించామని, కాని మహిళల్లో వయసుతోపాటే జ్ఞాపకశక్తి పెరిగినట్లు తమ పరిశోధనల్లో తేలిందని జేన్ ఎలియట్ తెలిపారు. ఇందులో ప్రధానంగా వారిలోని హార్మోన్ ఓస్ట్రోజన్ ప్రభావమేనని ఆమె తెలిపారు. తమ ఈ అధ్యయనంలో పదివేలమందిపై విద్య, వ్యక్తిగత సంబంధాలు, బంధువర్గం, చికిత్స తదితర అంశాలపై అధ్యయనం చేసినట్లు ఆమె వెల్లడించారు. 
 
1958లో ఒకే వారంలో పుట్టిన వారిలో 50 సంవత్సరాలు పూర్తయిన వారిని తమ ఈ అధ్యయనాలకు ఎంపిక చేసుకున్నామని ఆమె తెలిపారు. వారిలోని స్మరణశక్తిని అంచనా వేసేందుకు తాము పలురకాలుగా పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు పది శబ్దాలు ఇచ్చి ఐదు నిమిషాల తర్వాత ఆలోచించుకుని రాయాల్సివుంటుంది. 
 
తొలిసారి నిర్వహించిన పరీక్షలో పురుషులకన్నా మహిళలే ఐదు శాతం ఎక్కువ మార్కులు కొట్టేశారు. అదే రెండవసారి పెట్టిన పరీక్షలోను మహిళలే ఎనిమిది శాతం మార్కులు కొట్టేశారు. మూడవసారి నిర్వహించిన పరీక్షలోను పురుషులకన్నా మహిళలే పరీక్షను పూర్తి చేశారని ఆమె వివరించారు. మహిళల్లో జ్ఞాపకశక్తికి ప్రధాన కారణం హార్మోన్ల ప్రభావంతోపాటు వారిలోనున్న సెక్స్ హార్మోన్ ఓస్ట్రోజన్ కూడా ఇందుకు చాలా తోడ్పడుతుందని తమ అధ్యయనాల్లో తేలినట్లు ఆమె తెలిపారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం