మహిళల వెన్ను నొప్పికి.. భారీ వక్షోజాల సైజులే కారణమా?

Webdunia
గురువారం, 4 సెప్టెంబరు 2014 (15:56 IST)
చాలా మంది మహిళలు వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. ఎన్నో రకాలైన వైద్యం చేయించుకున్నప్పటికీ ఏమాత్రం ఉపశమనం కలగదు. అయితే, తమ వక్షోజాల పరిమాణానికి అనుగుణంగా ఉండే బ్రా ధరిస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పెద్ద సైజులో ఉండే వక్షోజాల వల్ల మహిళల మెడ, వీపు, భుజాలలో నొప్పి కలిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
మహిళలు ధరిస్తున్న బ్రా సైజులను తనిఖీ చేసి అవి వారి శరీర కొలతలకు తగిన విధంగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా, కొంతమంది మహిళలను తనిఖీ చేయగా, వారిలో ఏ ఒక్కరూ కూడా తమ శరీర కొలతకు తగిన బ్రాలను ధరించలేదట. 
 
వక్షోజాల బరువును మాత్రమే మోయాల్సిన బ్రాలు భుజాల బరువును మోయవలసి రావడం వల్ల వెన్ను నొప్పి కలుగుతోందని అలెక్స్ చెప్పారు. మహిళలు తమ వెన్ను సైజును నాలుగు అంగుళాల మేరకు తగ్గించి అంచనా వేస్తున్నారని, అదేసమయంలో తమ బ్రా కప్ సైజును మూడు సైజుల వరకు మించి అంచనా వేస్తున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. 
 
మహిళల మెడ, వెన్ను నొప్పికి సంబంధించిన సమస్యలు ప్రధానంగా కొలతకు అనుగుణంగా లేని బ్రాలతోటే వస్తున్నాయని చెప్పారు. అందుకనే మహిళలు తమ వక్షోజాల కొలతలకు అనువైన బ్రాలను మాత్రమే ధరించాలని సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాసా అదుర్స్.. 50ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మానవుడు.. ఆర్టెమిస్-II ప్రయోగం (video)

హవేరీలో ఘోర ప్రమాదం.. ఫ్లాట్‌ఫామ్‌కి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి (video)

అన్నం పెట్టే అవ్వ చనిపోయిందని విలపించిన వానరం, వీడియో వైరల్

నడిరోడ్డుపైనే మహిళపై సామూహిక అత్యాచారయత్నం.. బట్టలు చించేసి..?

అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు, ప్రపంచ ప్రసిద్ధి రాజధాని అవుతుందంటూ ఆశాభావం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

Show comments