Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాషన్ కంటే ఆరోగ్యమే ముఖ్యం... జాగ్రత్తలు పాటించకుంటే ప్రమాదమే...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (13:54 IST)
ఆధునిక యుగంలో మహిళలు ఫ్యాషన్ వెంట పరుగులు తీస్తున్నారు. అందంగా కనిపించడానికి తహతహలాడే అమ్మాయిలు మార్కెట్‌లో లభ్యమయ్యే దుస్తులు, వస్తువులను ఎడాపెడా వాడేస్తున్నారు. తద్వారా నడుము, వెన్ను, మెడ, చాతి నొప్పులు, వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
మహిళలు నిత్యం ధరించేలో దుస్తులు ముఖ్యమైనవి బ్రాలు. మహిళల్లో 70 శాతం మంది సరైన బ్రాని ధరించడం లేదు. ఆ కారణంగానే వెన్నునొప్పీ, ఛాతీ నొప్పీ వేధిస్తున్నాయి. మరికొందరిలో చర్మ సంబంధిత వ్యాధులూ, వెన్ను ఆకృతిలో తేడాలు బాధిస్తున్నాయి. సరైన కొలతలున్న బ్రాలు ధరించడం దీనికి పరిష్కారం.
 
ఈ మధ్య కాలంలో లేడిస్ హ్యాండ్ బ్యాగ్‌ కూడా ఫ్యాషన్ అయిపోయింది. హ్యాండ్ బ్యాగ్ లేనిదే అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు. ఈ బ్యాగుల కారణంగానే చాలా మందిలో వెన్నునొప్పీ, నడుంనొప్పి ఎక్కువ అవుతోంది. వీలున్నంత వరకూ మీ బ్యాగు బరువుని తగ్గించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.
 
వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ప్లిప్ ఫ్లాప్స్ చూడ్డానికీ వేసుకోవడానికీ సౌకర్యంగానే ఉంటాయి. కానీ వాటికి పాదాలకు దన్నుగా ఉండే ఆర్చ్ లేకపోవడం వల్ల వెన్నునొప్పి రావడానికి ఆస్కారం ఎక్కువ. కీళ్లూ దెబ్బతింటాయి. పాయింట్ హీల్స్‌కూ ఇదేరకం ఇబ్బంది ఉంది. మహిళలు ఉపయోగించే ఫ్యాషన్ వ్యార్‌లో బెల్టు కూడా ముఖ్యమైనదే.
 
బిగుతుగా ఉండే పెన్సిల్ స్కర్టులు శరీర కదలికల్ని కష్టబడి చేస్తాయి. దాంతో నిలబడేందుకే ప్రాధాన్యం ఇస్తాం. ఇందువల్ల వెన్ను సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అయితే  కోసం ధరించే బెల్టులు బిగుతుగా పెట్టుకొంటే కడుపులో నొప్పి రావడంతో పాటూ కాసేపటికి కాళ్లనూ మొద్దుబారేలా చేస్తాయి. బెల్టును ఎప్పుడూ వదులుగానే పెట్టుకోవాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments