Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి మహిళ రోజూ ఓ గ్లాసు పాలు తాగాలి.. ఎందుకో తెలుసా?

ప్రతి మహిళ రోజూ ఖచ్చితంగా ఓ గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదంటున్నారు. శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారానే అందుతాయన్నది ప్రతి ఒక్కరికీ

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (11:45 IST)
ప్రతి మహిళ రోజూ ఖచ్చితంగా ఓ గ్లాసు పాలు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి అనేక కారణాలు లేకపోలేదంటున్నారు. శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారానే అందుతాయన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం. అయితే, మహిళల్లో వయసు పెరిగేకొద్ది కాల్షియం సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దాంతో ఎముకలు బలహీనపడిపోతాయి. అందుకే మహిళలు ప్రతి రోజూ ఖచ్చితంగా పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
 
కాల్షియం.. ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియం కీళ్ళ నొప్పుల బారి నుండి కాపాడటంలో బాగా పనిచేస్తుంది. కాల్షియం పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది. అందుకే మీరు ఒక గ్లాసు పాలను ప్రతి రోజూ తీసుకున్నట్లయితే మీ ఎముకలు బలంగా ఉంటాయి.
 
ఉదయం నిద్ర లేచినది మొదలుకుని రాత్రి పడక గదికి చేరేంత వరకు ప్రతి మహిళ ఎంతో శ్రమిస్తుంది. దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా బాగా అలసిపోతుంది. ఒత్తిడితో కూడుకున్న జీవితం సుఖ నిద్రకు దూరం చేస్తుంది. అందుకే నిద్రకు ముందు ఒక గ్లాసు పాలను తాగడం ఎంతో మంచింది. ఎందుకంటే... పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ మెదడులో ఏర్పడిన ఒత్తిడిని మాయం చేసి సుఖమయ నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.
 
అలాగే, పాలల్లో ఉండే కాల్షియం మన శరీరం ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన శక్తిని అందించి, మంచి ఎత్తు, బరువు పెరిగేలా చేస్తాయి. వాస్తవానికి మన శరీర ఎదుగుదలలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారంలో పాలు అత్యంత బలవర్ధకమైన ఆహారం. కాబట్టి ప్రతిరోజూ ఓ గ్లాసు పాలు తాగి, అనారోగ్య సమస్యలకూ దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు.
 
చర్మ రక్షణ, సౌందర్యం కోసం ప్రతి రోజూ ఓ గ్లాసు పాలు తాగడం చాలా ఉత్తమం. పాలల్లో ఉండే అమినో ఆసిడ్స్ కాలుష్యం వల్ల మీ చర్మాన్ని హాని కారకాల నుండి కాపాడతాయి. చర్మం మెరిసిపోయేలా చేస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే లోకేష్ సర్: విద్యార్థులు ఇంకోసారి ఇలా చేయొద్దు.. నారా లోకేష్ (video)

Sharmila or Jagan?: ఏపీలో కూటమి సర్కారుకు విపక్ష నేత ఎవరు? షర్మిలనా? జగనా?

Vijaya Sai Reddy: విజయ సాయి రెడ్డి గారూ.. ఇది ధర్మమా? బండ్ల గణేష్ ప్రశ్న

ఇన్‌స్టా పరిచయం.. ముగ్గురు యువకుల కోసం మైనర్ బాలికలు వెళ్లారు.. చివరికి?

లెట్ ది బీట్స్ డ్రాప్: రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్ కోసం మీరు అనుసరించాల్సినవి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైత్రి మూవీ మేకర్స్ 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ టీజర్

ధన్య బాలకృష్ణ ఇన్వెస్టిగేషన్ హత్య చిత్రం ఎలా వుందంటే.. హత్య రివ్యూ

అఖండ 2: తాండవంలో సంయుక్త - చందర్లపాడులో షూటింగ్ కు ఏర్పాట్లు

ట్రైబల్ గర్ల్ పాయల్ రాజ్‌పుత్ యాక్షన్ రివైంజ్ చిత్రంగా 6 భాష‌ల్లో వెంక‌ట‌ల‌చ్చిమి ప్రారంభం

కృష్ణ తత్త్వాన్ని తెలియజేసిన డియర్ కృష్ణ- సినిమా రివ్యూ

తర్వాతి కథనం
Show comments