Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిఫ్రిజిరేటర్లలో వీటిని ఉంచరాదు....

ఆధునిక జీవనంలో రిఫ్రిజిరేటర్ల వాడకం బాగా ఎక్కువైంది. అన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రిఫ్రిజిరేటర్లో కొన్ని వస్తువులనే ఉంచాలి. ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లిపాయలు మరియు తరిగిన ఉలిపాయ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (19:29 IST)
ఆధునిక జీవనంలో రిఫ్రిజిరేటర్ల వాడకం బాగా ఎక్కువైంది. అన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ లోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రిఫ్రిజిరేటర్లో కొన్ని వస్తువులనే ఉంచాలి. ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉల్లిపాయలు మరియు తరిగిన ఉలిపాయ ముక్కలు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. వాటికుండే వాసన ఫ్రిడ్జ్ మొత్తంతో పాటు అందులో ఉన్న ఆహారం కూడా వాసన వచ్చేలా చేస్తుంది. టమాటోలకు స్వచ్ఛమైన గాలి తగలాలి. 
 
చల్లబడిన టమాటోలు రుచిని కోల్పోతాయి. కాబట్టి టమాటో ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెట్టకుండానే తినొచ్చు. అయితే సగ భాగంగా పుచ్చకాయని కోసి దాన్ని తిని, మరో సగం తరువాత తినాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేయ్యండి. తేనెకు ఎలాంటి రిఫ్రిజిరేటర్ అవసరం లేదు. అది ఎండాకాలమైనా, వానాకాలమైనా లేదా చలికాలమైనా, తేనె ఊరికే బయట పెట్టేస్తే వచ్చే నష్టమేమీ లేదు. బ్రెడ్‌ని ఏదైనా చల్లటి ప్రదేశంలో పెడితే సరిపోతుంది. రిఫ్రిజిరేటర్‌లో పెడితే, దానిలోని స్వచ్ఛమైన గుణాలు మనకు అందకపోవచ్చు. వెల్లుల్లి ఎక్కువకాలం పనికిరావాలంటే దాన్ని గాలి ఆడే చోట పెడితే సరిపోతుంది. దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరం లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments