Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేస్తోన్న రింగ్ టోన్!

Webdunia
శుక్రవారం, 8 మే 2015 (14:20 IST)
అమ్మ కడుపులోని గర్భస్థ శిశువు సెల్ ఫోన్ రింగ్ టోన్‌కు ఉలిక్కిపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. దీంతో సెల్ ఫోన్ రింగ్ టోన్ గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేస్తోందని పరిశోధకులు అంటున్నారు. అమ్మ కడుపులో వెచ్చగా నిద్రిస్తున్న శిశువు సెల్ ఫోన్ రింగ్ టోన్‌ ఉలిక్కిపడేలా చేస్తోంది.
 
అలాగే సెల్ ఫోన్‌ను పొట్టకు దగ్గరగా ఉంచడం వల్ల అది చేసే శబ్ధాలు గర్భస్థ శిశువును ఆందోళనకు గురిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. వైబ్రేషన్‌తోనూ ఈ ప్రభావం తప్పదని, దీంతో పిండం స్లీప్ సైకిల్ దెబ్బతింటుందని వివరించారు. పిండం నిద్రిస్తున్నప్పుడు సెల్‌ఫోన్ మోగితే ఉలికిపాటు లేస్తుందని పరిశోధకులు తెలిపారు. 
 
అందుచేత సెల్ ఫోన్స్ ఉపయోగించే మహిళలు గర్భస్థ శిశువును కూడా డిస్టబ్ చేయకుండా వినియోగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కడుపు దగ్గరగా కాకుండా కాస్త దూరంగా సెల్ ఫోన్‌ను వుంచాలి. వైబ్రేషన్, రింగ్ టోన్స్ సౌండ్ తగ్గించాలి. వీలైతే సైలెంట్ మోడ్‌లో పెట్టేసి అప్పుడప్పుడు సెల్ ఫోన్‌ను చెక్ చేసుకోవాలి. లేకుంటే గర్భిణీ మహిళ నిద్రించేంతవరకైనా సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలి. మొత్తానికి సెల్ ఫోన్లకు గర్భిణీ మహిళలు చాలామటుకు దూరంగా ఉండాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 
 
ఇంకా పరిశోధకులు ఏమంటున్నారంటే.. గర్భిణీ మహిళలు సెల్ ఫోన్లను అధికంగా వినియోగించడం ద్వారా పుట్టే పిల్లల అలవాట్లలో మార్పులుంటాయని తెలిపారు. ఇప్పటికే సెల్‌ఫోన్ల వాడకం ద్వారా క్యాన్సర్ ప్రమాదం పెద్దలో చాలామటుకు పెరిగిపోతోందని, పిల్లల మెదడుకు సెల్ ఫోన్‌తో రుగ్మతలు తప్పవని సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments