మీరు ప్రెగ్నెంట్ కావాలనుకుంటే.. ఈ టిప్స్ పాటించండి.

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (14:10 IST)
మీరు ప్రెగ్నెంట్ కావాలనుకుంటే.. ఈ టిప్స్ పాటించండి. గర్భం దాల్చడానికి ముందే కొన్ని విషయాలపై సరైన నిర్ణయం తీసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చేయండి. అలాగే శారీరకంగా మీ బరువును నియంత్రించుకోండి.

తక్కువ బరువు లేదా అధిక బరువు, ఈ రెండు స్థితులు కూడా గర్భం ధరించే ముందు లేదా తరువాత కాని అపాయకరమే. మీరు బరువు తక్కువగా ఉంటే, అది అండోత్సర్గము ప్రభావితం చేస్తుంది. మీరు అధిక బరువు కలిగిఉంటే, అది మధుమేహం మరియు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, గర్భం ధరించే ముందు ఒకసారి మీ బరువును చూసుకోండి.
 
మీరు వేసుకునే మందులు గురించి ఒక అవగాహనకు రండి. అలెర్జీ, తలనొప్పి లేదా ఇతర సంబంధ సమస్యల కోసం మందులు తీసుకుంటున్నట్లయితే, జాగ్రత్తగా ఉండండి! ఇందులో కొన్ని మందులు మీ బేబికి అపాయకరంగా ఉండవొచ్చు. మీరు తీసుకునే మందులు లేదా సిరప్లు గురించి మీ డాక్టరుకు తెలియచేయండి. అలాగే ఏ మందులు వాడవొచ్చో లేదా ఏవి వాడకూడదో సలహా తీసుకోండి.
 
పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని మీ రిఫ్రిజిరేటరులో నిల్వ ఉంచుకోండి పండ్లు, పండ్ల రసాలు మరియు ఇతర మల్టీవిటమిన్స్, ప్రోటీన్లు మరియు కాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలతో మీ ఫ్రిజ్‌ను నింపండి. మీ ఆహారంలో కూరగాయలు మరియు సోయా ఉత్పత్తులు, గింజలు, మరియు బీన్స్ ఉన్న పూర్తీ పోషకాహారాలు ఉండేట్లుగా చూసుకోండి.
 
ఇక మీ డ్రీం హౌస్ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంటే, అది మీ గర్భధారణకు ముందే చేయించండి. దీనికి వాడే పెయింట్స్, కఠినమైన క్లీనర్స్ మరియు పురుగుమందులు హానికరమైన రసాయనాలు కలిగిఉంటాయి. అవి తల్లి మరియు బిడ్డకు, ఇద్దరికీ మంచివి కావు
 
మీరు గర్భం ధరించాలి అన్న నిర్ణయానికి మూడు నెలల ముందే మీ వైద్యుడిని సంప్రదించండి. మీ రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ మరియు హెమోగ్లోబిన్ వంటివి సరిఅయిన స్థితిలో ఉన్నాయా, లేవా నిర్ధారించుకోండి. 
 
రిలాక్స్ అధిక ఒత్తిళ్ళకు లోనవటం వలన మీరు గర్భం ధరించలేకపోవొచ్చు. అందువలన గర్భం ధరించాలి అన్న నిర్ణయం తీసుకున్నప్పటినుండి రిలాక్స్‌గా ఉండండి. మంచి బుక్స్ చదవండి. సంగీతం వినండి. ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా తీసుకోండి ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉన్న పాలకూర, ఆకు కూరలు తీసుకోండి. వైన్, కెఫైన్ సిగరెట్స్‌ను పూర్తిగా మానేయండి. 
 
పొగ పీల్చటం మరియు వైన్ మీ శిశువు మానసిక లోపాలకు లేదా గుండెజబ్బులకు కారణం కావచ్చు. ఎక్కువగా కెఫీన్ తీసుకోవడం కూడా గర్భస్రావానికి దారితీస్తుంది అని పరిశోధనలు చెపుతున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

Show comments