Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు నల్ల వెల్లుల్లిని పాలలో కలుపుకుని తీసుకుంటే?

Webdunia
శనివారం, 20 మే 2023 (22:41 IST)
Black Garlic
మహిళలకు వెల్లుల్లి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే నలుపు వెల్లుల్లిని మహిళలు ఆహారంలో భాగం చేసుకుంటే.. వారికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. నల్ల వెల్లుల్లిలో అధిక యాంటీఆక్సిడెంట్ స్థాయిలు మధుమేహానికి బైబై చెప్పేస్తాయి. 
 
తాజా పచ్చి వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నల్ల వెల్లుల్లి గుండెను కాపాడుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 
నల్ల వెల్లుల్లి క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. పెద్దప్రేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నల్ల వెల్లుల్లిలోని సమ్మేళనాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను కూడా నిరోధించగలవు.
 
తెల్ల వెల్లుల్లిని సరైన ఉష్ణోగ్రత, తేమలో ఉంచడం ద్వారా నలుపు వెల్లుల్లిని తయారు చేస్తారు. నల్ల వెల్లుల్లిలో ఐరన్, విటమిన్ బి, సి, కె, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులోని ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. 
 
రోజూ ఉదయాన్నే పాలలో నల్ల వెల్లుల్లి కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తిని పొందడానికి గోరువెచ్చని పాలలో నల్ల వెల్లుల్లి, తేనె కలిపి తీసుకోవాలి.
 
నల్ల వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. నల్ల వెల్లుల్లిని తింటే శరీరంలోని చర్మం ముడతలు పోయి కాంతివంతంగా ఉంటుంది. కాలేయ సంబంధిత సమస్యలకు నల్ల వెల్లుల్లి మంచి మందుగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలుగు చిత్రపరిశ్రమపై కేంద్ర మంత్రి ప్రశంసలు.. బన్నీకి మద్దతుగా..

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవంత్ రెడ్డి ని కలిసేది పెద్ద నిర్మాతలేనా? వేడుకలకు బ్రేక్ పడనుందా?

రౌడీయిజం చేయనని ప్రతిజ్ఞ చేసిన పాత్రలో సూర్య44 రెట్రో

కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న 'పుష్ప-2' మూవీ

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే సినీ ప్రముఖులు ఎవరంటే..?

పాత రోజులను గుర్తు చేసిన మెగాస్టార్... చిరంజీవి స్టన్నింగ్ లుక్స్...

తర్వాతి కథనం
Show comments