Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటింట్లో గ్యాస్‌ని ఆదా చేయాలంటే...!!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (08:51 IST)
ప్రస్తుతం గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోతోంది. ఈ రోజుల్లో గ్యాస్‌ను పరిమితంగా వాడుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే గ్యాస్ వృథా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే వంటనూ త్వరగా పూర్తి చేసుకోవచ్చు. సరైన మంట, తగినంత నీరు, సరిపడిన పాత్ర ఇలా చిన్నచిన్న విషయాలపై దృష్టి పెడితే చాలు. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరి.
 
బర్నర్ రంధ్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్ వృథా అవుతుంది. గ్యాస్ స్టౌవ్ వెలిగించినపుడు మంట నీలిరంగులో ఉండాలి. ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో మండుతుంటే గ్యాస్ వృథా అవుతున్నట్టుగా గ్రహించి వెంటనే సర్వీసింగ్‌కు చేయించాలి. 
 
వంటకు అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాతే గ్యాస్ స్టౌవ్‌ను వెలిగించాలి. కాయగూరలను ఉడకబెట్టడానికి తగినంత నీరు మాత్రమే వాడాలి. ఎక్కువ నీరు పోసి వండితే పోషకాలు వృథా కావడమే కాకుండా గ్యాస్, సమయం కూడా వృథా అవుతుంది. 
 
కాయకూరలు, పప్పులను ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు. మంట పాత్ర అడుగుభాగాన్ని దాటి పైకి వస్తుంటే గ్యాస్ వృధా అవుతున్నట్టుగా గుర్తించాలి. కూరగాయలు, అన్నం తయారు చేసేటపుడు పాత్రలపై విధిగా మూతను వాడాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథాకావు. పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఇలాంటి చిన్నపాటి చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments