ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెడితే?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2015 (12:24 IST)
ఆహారాన్నిదాచుకోవడానికి ఫ్రిజ్ ఉంది కదా అని ప్రతిదాన్నీ అందులో పెట్టేందుకు కాదనే విషయాన్ని ఏ ఒక్కరూ గ్రహించరు. అందుకే ప్రతి వస్తువును అందులో దాచేస్తుంటాం. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ తగినది కాదు. 
 
తులసి ఆకు ఎంత సువాసన వస్తుందో, అంత త్వరగానూ తన వాసనను కోల్పోతుంది. అందుకే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే మిగతా పదార్థాల వాసనను సంగ్రహించి వాటి వాసన మారిపోతుంది.
 
బంగాళదుంపల్ని ఫ్రిజ్‌లో ఉంచితే ఆ తేమకి వాటిలోని గంజిపదార్థం చక్కెరగా మారిపోతుంది. కాబట్టి వాటిని పెట్టకూడదు. 
 
ఉల్లిపాయల్నిఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లదనం ఉల్లిపాయల్ని మెత్తబడిపోయేలా చేస్తుంది. కాఫీ గింజల్ని ఫ్రిజ్‌లో ఉంచితే అవి వాటి సహజ సువాసనను కోల్పోవడమేకాకుండా చుట్టూ ఉన్నఆహారపదార్ధాల వాసనను కూడా పీల్చుకుంటుంది. 
 
ఆలివ్ నూనెను ఫ్రిజ్‌లో పెడితే దాని కన్సిస్టెన్సీ మారిపోతుంది. నూనె మరింత చిక్కబడిపోతుంది. తేనెను పరిమితిని మించిన చల్లదనంలో ఉంచితే అది గట్టిపడిపోయి సహజగుణాన్నికోల్పోతుంది. కాబట్టి కాసిన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఫ్రిజ్‌లో పెట్టకపోవడమే మంచిది. 
 
అలాగే కాస్త పచ్చిగా ఉన్న టొమాటోల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకంటే అందులోని చల్లనిగాలి వాటిని పండనివ్వదు. దాంతో అవి ఫ్లేవర్‌ను కోల్పోతాయి.ఇక అరటిపండ్లుని ఫ్రిజ్‌లో పెడితే గట్టి పడి వాటికి ఉండే సహజమైన రుచిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

తాజ్ మహల్‌ను సందర్శించిన రూబియో.. ఫైర్ అయిన ఇరాన్

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Show comments