పాపాయిల నోటి ఆరోగ్యం గురించి పట్టించుకోండి!

Webdunia
గురువారం, 8 జనవరి 2015 (17:19 IST)
అప్పుడే పుట్టిన పాపాయి గుక్కపెట్టి ఏడిస్తే చాలు కంగారుపడి పోతాం... రెండు గంటలు దాటి పాలు తాగకపోయినా వెంటనే నిద్రలేపి పట్టేస్తాం. ఇవ్వొక్కటే కాదు. పిల్లల పెంపకంలో చేసే ఇలాంటి చర్యలు చాలామటుకు పొరపాట్లే అంటారు నిపుణులు. 
 
పాపాయిలు మెలకువగా ఉన్నంతసేపూ వాళ్లు ఏడవకుండా చూస్తుంటాం. కానీ పాపాయిలు తమకున్న అసౌకర్యాన్నీ, మరేదైనా ఇబ్బందినీ ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అలాంటప్పుడు వెంటనే ఏదో ఒక విధంగా ఊరడించే ప్రయత్నం చేయడం కన్నా కారణం తెలుసుకోవాలి. 
 
ఒళ్లు కాస్త వెచ్చగా ఉంటే చాలు ఏదో ఒక సిరప్ వేసేస్తుంటాం. కానీ కాస్త వేడిగా ఉన్నంతమాత్రాన కంగారుపడాల్సిన అవసరంలేదు. శరీర ఉష్టోగ్రత బాగా వేడిగా ఉందనుకున్నప్పుడు కొన్ని గంటలపాటు గమనించాలి. ఆ తర్వాతే వైద్యుల్ని సంప్రదించాలి. ఏదో ఒకటి వేసే ప్రయత్నం సబబు కాదు. 
 
చాలామంది తల్లిదండ్రులు పాపాయిల నోటి ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. అదే భవిష్యత్‌లో పళ్ల సమస్యలకు దారితీస్తుంది. అందుకే వాళ్లకు పళ్లు లేకపోయినా కూడా ప్రతీ రోజూ నోటిని శుభ్రపరచాలి. వేళ్లతోనే చిగుళ్లను రుద్ది, నోరు కడగాలి. ఆ తర్వాతే పాలు పట్టాలి. ఏడాది వచ్చాక మెత్తని టూత్‌బ్రష్‌ని వాడటం తప్పనిసరి అని చైల్డ్ కేర్ నిపుణులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు

నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత

పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?

ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు

నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

Show comments