Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి.. క్యాన్సర్ ముప్పు?

నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి సహజం. కానీ నొప్పికి క్యాన్సర్‌కు లింకు లేదంటున్నారు వైద్యులు. సాధారణంగా కొందరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాల్లో గడ్డలు ఏర్పడుత

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (11:51 IST)
నెలసరి రావడానికి ముందు వక్షోజాల్లో నొప్పి సహజం. కానీ నొప్పికి క్యాన్సర్‌కు లింకు లేదంటున్నారు వైద్యులు. సాధారణంగా కొందరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్లు పనిచేసే తీరును బట్టి వక్షోజాల్లో గడ్డలు ఏర్పడుతుంటాయి. వీటిలో 90 శాతం వరకూ క్యాన్సర్ కారకాలు కానివే వుంటాయి. వాటిలో కూడా ఎక్కువగా ఫైబ్రో ఆడినోమా గడ్డలే వుంటాయి. వీటితో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం వుండదు. 
 
ఇవి ఒక్కొక్కరిలో రకరకాల పరిమాణాల్లో వుంటాయి. పీరియడ్స్ వచ్చే వారానికి ముందు వక్షోజాల్లో కొద్దిగా నొప్పి వుంటుంది. వక్షోజాల్లో ఉన్న ఫైబ్రస్ టిష్యూ కొద్దిగా గట్టిపడుతుంది. అది కొద్ది కొద్దిగా పెరగడం వల్ల ఫైబ్రో అడినోమా గడ్డలు ఏర్పడతాయి. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు వుండవు. 
 
ఇవి మెల్లగా, కొద్దిగానే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ గడ్డలు మాత్రం.. అతి త్వరగా పెద్దగా పెరుగుతాయని గ్రహించాలి. అవి చుట్టూ పాకుతాయి. అలాగే పీరియడ్స్‌కు ముందు కాకుండా ఎప్పుడూ నొప్పిగా వుంటాయి. అలా వుంటే తప్పకుండా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna :డాకూ మహారాజ్ లో మోక్షజ్న ? డాకూ మహారాజ్ కు పార్ట్ 2 వుంటుందా?

మెస్మరైజ్ చేస్తున్న ఉన్ని ముకుందన్ మలయాళ చిత్రం మార్కో

పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు

Sreeleela: బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కు ఓకే చెప్పిందా? ఐటమ్ గర్ల్‌గా శ్రీలీల ఎంట్రీ?

తర్వాతి కథనం
Show comments