పైసా ఖర్చు పెట్టకుండా చర్మ సౌందర్య రక్షణ ఎలా?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2015 (13:12 IST)
ఈ ఆధునిక ప్రపంచంలో అందాన్ని కాపాడుకోవటం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. మార్కెట్లో దొరికే ఎన్నోవస్తువుల్నివాడటం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటాం. అయితే, పైసా ఖర్చు పెట్టకుండానే మన ఇంట్లోనే ఖర్చు లేకుండా మన అందాన్ని కాపాడుకునేవి ఎన్నో ఉన్నాయి. ఇవి ఎంతో సహజమైనవి, ఆరోగ్యానికి, చర్మానికి హాని కలిగించనివి కావడం గమనార్హం. ఖర్చు లేకుండా మీ చర్మ రక్షణ కై ఈ సూత్రాలు పాటించండి.
 
రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో మృదువుగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. టీ స్పూన్ పెసరపిండి, కొన్నిబాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అర్థ గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది.
     
కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఎండిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. మీ ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకుని  కోడిగుడ్డులోని తెల్ల సొనని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరా దోసకాయని తీసుకుని అర కప్పు పెరుగులో కలిపి 5-10 నిమిషాలు ముఖానికి పట్టించి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాటోలో యూఎస్ఎ లేకపోతే అది ఓ పేపర్ పులి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా: ట్రంప్

ఏప్రిల్ 2వ వారంలో ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఆడబిడ్డ పుట్టిందని 15 రోజుల పసికందును విషమిచ్చి చంపేసిన తండ్రి.. ఎక్కడ?

58 మంది మహిళలపై లైంగిక దాడి.. మత్తు మందిచ్చి అత్యాచారం.. పెన్ డ్రైవ్ లభ్యం

ఉత్తర కొరియా ఎన్నికలు.. కిమ్‌కు 99.93 శాతం ఓట్లు.. 0.07శాతం ఓట్లు ఎటు వెళ్ళాయి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ అంటున్న చిత్ర యూనిట్

Niharika Konidela: రాకాస నుంచి స్నేక్ డ్యాన్స్ వీడియో సాంగ్ రిలీజ్

Teja Sajja : ఓటీటీ రియాలిటీ షో ది ట్రైటర్స్ హోస్ట్ గా తేజ సజ్జా

G.V. Prakash Kumar: మన అందరి జీవితాల్లో నాన్నబిగ్గెస్ట్ హీరో : జివి ప్రకాష్ కుమార్

రవీంద్ర తేజ్, అరియా మోడీ ప్రేమికులుగా లవ్‌ వాలా మూవీ ప్రారంభం

Show comments