Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణపయ్య జననం గురించి మీకు తెలుసా? విష్ణువు గంగిరెద్దుగా ఎందుకు మారాడు?

సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సుచే శివునిని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరము న

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (18:00 IST)
సూతమహర్షి శౌనకాది మునులకు ఆది దేవుడైన గణపయ్య పుట్టుక గురించి ఇలా చెప్పుకొచ్చారు. గజముఖుడైన అసురుడు తన తపస్సుచే శివునిని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరము నందే నివసించాలని కోరుతాడు. ఆ ప్రకారం శివుడు అతడి పొట్టలో బందీ అవుతాడు. అతడు అజేయుడవుతాడు. భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీ దేవి దుఃఖితురాలైంది. 
 
శంకరుడు లేని జగత్తు ఎందుకని.. తన భర్తను విడిపించే ఉపాయమును చెప్పాల్సిందిగా విష్ణువును కోరింది. అంతే విష్ణువు గంగిరెద్దు వేషంతో గజమాఖాసురుడిని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంలో ఏమి కావాలో కోరుకోమంటాడు. విష్ణుదేవుని వ్యూహము ప్రకారం నీ ఉదరమున ఉన్న శివుడిని కోరుతాడు. దీంతో తన అంత్యకాలము దాపురించిందని గమనించిన గజముఖుడు.. మాట తప్పకుండా పొట్టలో ఉన్న శివుడిని ఉద్దేశించి ప్రభూ.. శ్రీహరి ప్రభావముతో తన జీవితము ముగిసిపోయేట్లుందని.. తన తర్వాత తన శిరస్సు త్రిలోక పూజితం కావాలని కోరుకుంటాడు. 
 
తన చర్మము నిరంతరం నీవు ధరించునట్లు అనుగ్రహించాలంటాడు. ఆపై నందీశ్వరుడు గజముఖుడి ఉదరము చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకుని కైలాసానికి వెళ్తాడు. మరోవైపు భర్త రాక తెలుసుకుని పార్వతీ దేవి పరమానందంతో స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా, స్నానాలంకారముల ప్రయత్నములో తనకు ఉంచిన నలుగు పిండితో ఓ ప్రతిమను చేసింది. అది చూడముచ్చటగా బాలుగా కనిపించింది. దానికి ప్రాణప్రతిష్ట చేసింది. 
 
అంతకు పూర్వమే తన తండ్రి అగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసి.. ఆ దివ్య సుందరమైన బాలుడిని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు శివుడిని పార్వతి వద్దకు పోనివ్వలేదు. అంతే శివుడు కోపముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు. జరిగిందంతా విని పార్వతి విలపించింది. 
 
శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికిస్తాడు. అలా గజముఖుడికి త్రిలోకపూజనీయతను కల్పించినాడు. గణేశుడు శివపార్వతుల ముద్దులపట్టియైనాడు. విగతజీవుడైన గజముఖాసురుడు మూషిక రూపమున వినాయకుడిని వాహనమైనాడు. అలా గజముఖుడు త్రిలోక పూజ్యుతుడు కాగా, విఘ్నేశ్వరుడు ఆది దేవుడైనాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

Mauni Amavasya: మౌని అమావాస్య, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments