వినాయక చవితి స్పెషల్ : కోకో నట్ లడ్డూ ఎలా చేయాలి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2015 (15:56 IST)
వినాయక చవితి సందర్భంగా కొబ్బరి తురుముతో లడ్డూ ఎలా చేయాలో తెలుసుకుందాం.. సాధారణంగా కొబ్బరిలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. కొబ్బరి పాలు తల్లిపాలితో సమానం అంటారు.

కొబ్బరి హృద్రోగ వ్యాధుల్ని చాలామటుకు తగ్గిస్తుంది. రోగనిరోధకత పెంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలెన్నో దాగివున్న కొబ్బరితో లడ్డూలు తయారు చేసిన పండగ పూట వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకుందాం.. 
 
కావలసిన పదార్ధాలు :
చిక్కటి పాలు - అర లీటరు 
పంచదార - అర కేజీ
పచ్చి కొబ్బరి తురుము - ఆరు కప్పులు 
ఏలకుల పొడి - అర టీ స్పూన్ 
జీడిపప్పు - ఒక కప్పు
 
తయారీ విధానం : 
ముందు స్టౌ మీద బాణలి పెట్టి పాలు, పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి కలిపి సన్నని సెగపై చిక్కబడేవరకు కలుపుతూ ఉండాలి. రంగు మారి గట్టిపడుతున్నప్పుడు ఏలకుల పొడి... నేతిలో వేయించిన జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి, కొంచెం చల్లారాకా ఉండలు ఉండలుగా చేసి పక్కనబెట్టుకోవాలి. కావాలంటే మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. అంతే కొబ్బరి లడ్డూ రెడీ అయినట్లే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంతపూర్ జిల్లాలో నీటి లభ్యతను బలోపేతం చేస్తున్న అల్ట్రాటెక్

మద్యం మత్తుతో తల్లిని, చెల్లిని వేధిస్తావా.. గొడ్డలితో నరికేసిన కుమారుడు

నోయిడా వెళితే పదవి పోతుందని భయపెట్టారు : ప్రధాని నరేంద్ర మోడీ

తెలంగాణ: బడుల్లో ఇక రకరకాలైన టిఫిన్లు.. పాలు, రాగి జావ.. మెనూ ఇదే

విజయవాడలో ఘోరం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఎవరూ లేని ప్రదేశానికి?

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2026 గురువారం ఫలితాలు - పొగడ్తలకు పొంగిపోవద్దు

25-03-2026 బుధవారం ఫలితాలు-దంపతుల మధ్య అకారణ కలహం

24-03-2026 మంగళవారం ఫలితాలు - ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు

23-03-2026 సోమవారం దినఫలాలు : సమర్ధతపై నమ్మకం సన్నగిల్లుతుంది...

22-03-2026 ఆదివారం ఫలితాలు - మీ తప్పిదాలను సరిదిద్దుకునే..?

Show comments