Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెజ్ కట్లెట్ తయారీ విధానం

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (15:46 IST)
కావాల్సిన పదార్ధాలు:
బంగాళాదుంపలు - 1/4 కిలో, 
క్యారెట్ - రెండు, 
బీట్‌రూట్ - ఒకటి, 
పచ్చి బఠానీ - 1/4 కప్పు, 
పెద్ద ఉల్లిపాయ - ఒకటి, 
మైదా - ఒక స్పూను, 
కారం - సరిపడ
ఉప్పు - సరిపడ, 
గరం మసాలా పొడి - ఒక టీ స్పూను, 
రస్క్ పౌడర్ - 1/4 స్పూను, 
నూనె - సరిపడ
 
తయారీ విధానం 
ముందుగా క్యారెట్, బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలను కట్ చేసుకుని.. వాటికి బఠానీలను కలిపి ఉడికించాలి. అనంతరం బంగాళాదుంపను ఉడికించి పై తొక్కను తీసివేసి ముద్దలా చేసుకోవాలి. స్టౌమీద బాండలి పెట్టి నూనె పోసి బాగా కాగక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. తర్వత మనం ముందుగా ఉడికించిన క్యారెట్, బీట్‌రూట్‌లను కూడా వేసి నీరు మొత్తం ఆవిరియ్యే వరకు వేగనివ్వాలి. 
 
ఇందులో గరం మసాలా, కారం, ఉప్పులను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి దించి చల్లార్చాలి. ఇప్పుడు మైదాకు కొంచెం నీరు పోసి పేస్టులా తయారు చేసుకుని వేయించిన కూరల మిశ్రమానికి దాదాపు సమానంగా ఉండలా చేసుకోవాలి. అనంతరం మైదాలో కూరల మిశ్రమాన్ని ముంచి తీసి దాని పైన బ్రెడ్ ముక్కలు లేదా రస్క పౌడర్‌ అది కావలసిన ఆకారంలో కట్లెట్‌లా వత్తుకోవాలి. స్టౌమీద పెనం పెట్టి నూనె వేసి సన్నని మంట మీద రెండు ప్రక్కల ఎర్రగా కాల్చితే వెజ్ కట్లెట్ రెడీ. 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

Show comments