Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినప పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు తయారీ ఎలా?

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (15:01 IST)
కావలసిన పదార్థాలు :
మినప్పప్పు... రెండు కప్పులు
శెనగపప్పు... అర కప్పు
క్యారెట్ తురుము... అర కప్పు
క్యాబేజీ తురుము... అర కప్పు
అల్లం, పచ్చిమిరప పేస్ట్... 5 టీస్పూన్లు
పుదీనా, కరివేపాకు తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఉల్లిపాయ తరుగు... అర కప్పు
నూనె... వేయించేందుకు సరిపడా
 
తయారీ విధానం :
ముందుగా మినప పప్పు, శనగపప్పులను మూడు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో నీటిని ఒంపేసి కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో.. ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, అల్లం పచ్చిమిరప పేస్ట్, పుదీనా కరివేపాకు తరుగు, తగినంత ఉప్పువేసి బాగా కలుపుకోవాలి.
 
ఇప్పుడు బాణలిలో నూనెపోసి బాగా కాగిన తరువాత.. పై మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని వడల్లాగా వత్తి వేయాలి. రెండువైపులా బాగా ఎర్రగా కాలిన తరువాత తీసేయాలి. అంతే మినప్పప్పుతో మిక్స్‌డ్ వెజిటబుల్ వడలు రెడీ అయినట్లే...! వీటిని వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఇష్టమైనవాళ్లు ఈ వడలను ఎర్రకారం లేదా సాస్‌తో పాటు ఆరగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Gali Janardhan Reddy plea to Release 53 Kg Gold in Telangana High Court

Reel on railway platform: రైలు ఫ్లాట్ ఫామ్‌‌పై యువతి రీల్స్.. తమాషా వుందా? అంటూ పడిన అంకుల్! (video)

ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్.. తిరుమలలో మత్తు మందిచ్చి దోచేసుకున్నారు..

4 రోజులు - 3 రాత్రులు... బెంగుళూరు టూరిజం - ట్రాఫిక్ జామ్‌పై పాయ్ వ్యంగ్య ట్వీట్

లేడీస్ లిక్కర్ పార్టీలు: ఈ నగరాలకు ఏమవుతోంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vastunnam : సంక్రాంతికి వస్తున్నాం రికార్డు బద్ధలు.. ఓటీటీ, టీఆర్పీ రేటింగ్స్‌ అదుర్స్

సాయి దుర్గ తేజ్ సంబరాల యేటిగట్టు నుంచి హోలీ న్యూ పోస్టర్‌

మెగాస్టార్ చిరంజీవికి యుకె పార్ల‌మెంట్‌‌లో స‌న్మానం

కిరణ్ అబ్బవరం.. దిల్ రుబా చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

Show comments