టమోటా పప్పుతో ఆరోగ్యానికి మేలెంతో తెలుసుకోండి?

Webdunia
శనివారం, 20 జూన్ 2015 (15:33 IST)
టమోటాలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కంటి దృష్టి లోపాలను సరిచేసి, కంటి ఆరోగ్యానికి మేలు చేసే టమోటా.. లోబీపి నివారిస్తుంది. డయాబెటిస్‌, చర్మ వ్యాధులను, యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అలాంటి టమోటా, పప్పుతో కూర ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
టమోటాలు - పావు కేజీ  
కందిపప్పు - పావు కేజీ 
పచ్చిమిర్చి ముక్కలు - నాలుగు 
కరివేపాకు, కొత్తిమీర తరుగు - అర కప్పు 
కారం - అర టీ స్పూన్
పసుపు - 1 చిటికెడు
పోపు - సరిపడినంత
ఎండు మిర్చి- 1 
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు 
ఇంగువ- చిటికెడు
నూనె, ఉప్పు, చింతపండు - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా కందిపప్పును బాగా ఉడికించాలి. సగానికి ఉడికిన తర్వాత.. టమోటా ముక్కలు, ఉల్లిపాయ తరుగు చేర్చుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు పోసి ఉల్లిపాయ ఉడికేంతవరకు ఉంచి, అనంతరం బాణలి నూనె వేడయ్యాక పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ, ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి. అంతే టమోటా పప్పు రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ పరిస్థితి ఇలా వుందా? భీకర దాడులు చేయబోతున్నాం: అమెరికన్ రక్షణమంత్రి

ప్రపంచ కిడ్నీ దినోత్సవం: పాలకొండలోని ఏరియా ఆసుపత్రి, స్థానిక రైతులకు మద్దతుగా నెఫ్రోప్లస్ ఆర్ఓ ప్రక్రియ

అంతర్జాతీయ విమానాశ్రయంగా మధురై ఎయిర్‌పోర్టు.. కేంద్రం ఆమోదం

తమ కుమార్తెను పెళ్లాడుతానన్న యువకుడికి కరెంట్ షాకిచ్చి కాలు నరికి చంపిన యువతి పేరెంట్స్

Papaya: వేసవి, రంజాన్ పండుగ... మార్కెట్లోకి రుచికరమైన బొప్పాయి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Allu Arjun 23: అల్లు అర్జున్ 23 చిత్రం స్పెషల్ థీమ్ సాంగ్ ర్యాంపేజ్

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని విడుదలకి సిద్ధమైన సందిగ్ధం

Mark K Robin: గద్దర్ పాటలు కాదు ఫైర్ - ఆయన పేరుతో అవార్డు రావడం ఆనందంగా వుంది : మార్క్ కె రాబిన్

గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా హర్షిత్ రెడ్డి దీవాన మూవీ రిలీజ్

Show comments