Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైస్‌కు బెస్ట్ కాంబినేషన్ : స్టఫ్‌డ్ బెండ కూర

Webdunia
మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (15:39 IST)
వంకాయతో కూరలు చేసివుంటారు. కానీ బెండతో ట్రై చేశారా.. ఎప్పుడూ ఒకేలాంటి రిసిపీతో బోర్ కొట్టిస్తుంటే.. కాస్త వెరైటీగా బెండతో గుత్తికూర ఎలా చేయాలో ట్రై చేయండి. బెండకాయలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ శక్తులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తాయి. అందుచేత కూరలు, వేపుల్లా కాకుండా బెండతో గుత్తికూర ఎలా చేయాలో ట్రై చేద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
బెండకాయలు: అరకేజీ 
నూనె: తగినంత
 
స్టఫింగ్ కోసం: 
ఉడికించి రుబ్బుకున్న సెనగల పేస్ట్ : ఒక కప్పు 
వేయించిన పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు : రెండేసి టేబుల్ స్పూన్లు
పచ్చి మిర్చి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు: పావు టీ స్పూన్ 
నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర: గుప్పెడు 
ఉప్పు: రుచికి తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా అవిసె గింజలు, నువ్వులు, పల్లీలను విడివిడిగా మిక్సీలో పౌడర్‌లా చేసుకుని పక్కన బెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా సిద్దం చేసి ఉంచుకున్న సెనగల ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి ముద్ద, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా కలపాలి. 
 
బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయే వరకు ఆరబెట్టి, రెండు వైపులా తొడిమలు తీసి, మధ్యకు గాటు పెట్టాలి. తర్వాత స్టఫింగ్ మిశ్రమాన్ని బెండకాయలో స్టఫ్ చేసి.. వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక బెండకాయలను ఒక్కొక్కటిగా ఉంటి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి. 
 
స్టఫ్ బెండకాయ 10నిముషాలు ఉడికిన తర్వాత పల్లీ, నువ్వులు, అవిసె గింజల పొడుల మిశ్రమం వేసి కలిపి దించేయాలి. అంతే స్టఫ్డ్ బెండీ రెడీ. ఇది వేడి రైస్, చపాతీలకు చాలా టేస్ట్‌గా ఉంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments