Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్మా పనీర్ గ్రేవీ ఎలా చేయాలి?

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (17:22 IST)
డయాబెటిస్‌కు గుడ్ ఫుడ్ అయిన రాజ్మా, పనీర్‌తో గ్రేవీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు: 
రాజ్మా : రెండు కప్పులు 
పనీర్ : రెండు కప్పులు 
ఉల్లి తరుగు : అర కప్పు 
టమోటా తరుగు : అర కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు 
పసుపు : అర టీ స్పూన్ 
ధనియాల పొడి : ఒక టీ స్పూన్
జీలకర్ర : అర స్పూన్
గరం మసాల : 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా 
నూనె : తగినంత
 
తయారీ విధానం : ముందుగా రాజ్మాను ఆరు గంటల పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు మరియు టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేయాలి. వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.  అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
 
అందులో టమోటో గుజ్జు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇందులోనే పన్నీర్ ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై అయిన తర్వాత అందులో రాజ్మా ఉడికించిన నీటిని పోసి బాగా మిక్స్ చేయాలి. పన్నీర్ మెత్తగా ఉడికే సమయంలో అందులో రాజ్మ, గరం మసాలా కూడా వేసి మంటను మీడియంగా పెట్టి ఉడికించుకోవాలి. 10నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్, రాజ్మా కర్రీ రెడీ..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments