Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనియన్ పరోటా రిసిపీ ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 16 జూన్ 2015 (18:11 IST)
ఉల్లిపాయలు బరువును తగ్గిస్తాయి. కడుపు, ప్రేగు క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడే ఆనియన్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడంతో పాటు రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. అలాంటి ఉల్లిపాయతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ పరోటా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
గోధుమ పిండి - రెండు కప్పులు
ఉల్లిపాయ తరుగు - ఒకటిన్నర కప్పు
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చి ముక్కలు - రెండు టీ స్పూన్లు 
గరం మసాలా - అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు 
ధనియాల పొడి - ఒక టీ స్పూన్, 
నూనె, ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా చిన్న పాన్‌‍లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి అవి చిటపటలాడాక అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరం మసాలా, ధనియాల పొడి, వేసి బాగా మిక్స్ చేసి, రెండు నిముషాలు వేగించి, స్టౌ ఆఫ్ చేసేయాలి. ఈ మిశ్రమాన్ని పది నిముషాల పాటు చల్లారనివ్వాలి. 
 
ఫ్రై చేసి చల్లార్చిన ఆనియన్ మిశ్రమంలో ఒక కప్పు గోధుమ పిండి, రెండు చెంచాల నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు కలుపుకొని చపాతీ పిండిలా మృదువుగా, మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొన్న పిండికి కొద్దిగా నూనె రాసి, ఒక పల్చటి కాటన్ క్లాత్‌లో చుట్టి ఒక పదిహేను నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15నిముషాల తర్వాత పిండిలో నుండి కొద్దికొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. 
 
వీటిని చపాతీ కర్రతో చపాతీల్లా చుట్టుకోవాలి. ఈ చపాతీలను వేడయ్యాక చపాతీలను ఇరు వైపులా నూనె రాసుకుని.. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అంతే ఆనియన్ పరోటా రెడీ. వీటిని  పొటాటో కర్రీ లేదా రైతాతో వేడి వేడిగా సర్వ్ చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments