Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ అండ్ ఈజీ ఓట్స్, బాదం దోసె!

Webdunia
మంగళవారం, 2 డిశెంబరు 2014 (18:16 IST)
ఓట్స్, బాదం ఒబిసిటీని దూరం చేస్తాయి. వీటిలోని గుడ్ ఫ్యాట్, లో కెలోరీస్ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఒకే రకమైన దోసె రిసిపిని తిని బోరుకొడుతుంటే, ఇలా వెరైటీగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారుచేసుకోవచ్చు. ఇది టేస్ట్‌ మాత్రమే కాకుండా హెల్దీగానూ ఉపయోగపడుతుంది. 
 
కావల్సిన పదార్థాలు: 
బియ్యం పిండి: రెండు కప్పులు 
పచ్చిమిర్చి తరుగు : మూడు స్పూన్లు
గోధుమ పిండి: రెండు కప్పులు 
ఓట్స్ పౌడర్: రెండు కప్పులు 
బాదం తురుము : అరకప్పు
పెప్పర్ పౌడర్: ఒక టీ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, గోధుమపిండి, ఓట్స్ పౌడర్, పచ్చిమిర్చి, బాదం తురుము, పెప్పర్ పౌడర్, తగినంత ఉప్పు, నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి.
 
మరుసటి రోజు ఉదయం పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె రాయాలి. తవా వేడయ్యాక గరిటతో పిండితీసుకొని దోసెలా పోసుకోవాలి. మీడియం మంటమీద రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే రుచికరమై ఓట్స్ దోసె రిసిపి రెడీ. దీనికి కొబ్బరి చట్నీ, సాంబార్‌తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతేగాకుండా హెల్దీ కూడా. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దుబాయ్‌లో హోలీ వేడుక చేసుకోవడానికి ట్రావెల్ గైడ్

Ceiling fan: పరీక్షలు రాస్తుండగా వున్నట్టుండి.. సీలింగ్ ఫ్యాన్ ఊడిపడితే..?

వీవింగ్ ది ఫ్యూచర్-హ్యాండ్లూమ్ కొలోక్వియం సదస్సు నిర్వహణ

హోలీ పండుగ: మార్చి 14న మద్యం దుకాణాలు బంద్.. రంగులు అలా చల్లారో తాట తీస్తాం..

College student: కళాశాల విద్యార్థినిపై 16 నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

Show comments