Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసందైన మష్రుమ్-కార్న్-కాజు గ్రేవి

Webdunia
శుక్రవారం, 5 డిశెంబరు 2014 (17:44 IST)
కావల్సిన పదార్థాలు : 
మష్రుమ్ (పుట్టగొడుగులు)  - మూడు కప్పులు (తరిగి పెట్టుకోవాలి)
కార్న్(మొక్కజొన్నవిత్తనాలు) - ఒక కప్పు
జీడిపప్పు - పావు కప్పు
టమోటో - రెండు కప్పులు (సన్నగా తరిగినవి)
అల్లం - ఒక టీ స్పూన్ (సన్నగా తరిగినవి)
పచ్చిమిరప - ఒకటి (సన్నగా తరిగినవి)
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - పావు టీ స్పూన్
కారం - పావు టీ స్పూన్
ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
ఉప్పు - తగినంత 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు - ఒక కప్పు 
 
తయారుచేయండి ఇలా:
మొదట మిక్సీ జార్ లో టమోటాలు, జీడిపప్పు, అల్లం, పచ్చి మిరప కాయ వేసి ఒక నిముషం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేసి ఒక నిముషం వేగించాలి.
 
తర్వాత అందులో చిటికెడు ఇంగువ, జీలకర్ర వేసి మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. అనంతరం అందులోనే ధనియాల పొడి, కారం, పసుపు, మరియు ఉప్పు కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. 
 
ఈ విధంగా మొత్తం మసాలా వేయించుకుని అందులో కార్న్ మరియు మష్రుమ్ వేసి మొత్తం మిశ్రామన్ని కలగలిపి సరిపడా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కావలసినంతగా చిక్కబడే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. అంతే పసందైన మష్రుమ్ - కార్న్- కాజు గ్రేవీ రెడీ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments