పుల్ల మామిడితో "రవ్వ పులిహోర" తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:46 IST)
కావలసిన పదార్థాలు :
పుల్లటి మామిడికాయ తురుము.. రెండు కప్పులు
బియ్యం రవ్వ.. నాలుగు కప్పులు
ఆవాలు.. రెండు టి స్పూన్లు
శెనగపప్పు, మినప్పప్పు.. రెండు టి స్పూన్లు చొప్పున
వేరుశెనగ పప్పు.. నాలుగు టి స్పూన్లు
జీడిపప్పులు.. 20
పచ్చిమిర్చి.. ఎనిమిది
ఎండుమిర్చి.. నాలుగు
ఇంగువ, పసుపు.. అర టి స్పూన్లు 
కరివేపాకు.. నాలుగు రెబ్బలు
నూనె, ఉప్పు.. సరిపడా
 
తయారీ విధానం :
ఎనిమిది కప్పుల నీటిలో బియ్యం రవ్వ, నాలుగు టీసూప్న నూనె, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. ఆపై దాన్ని ప్లేట్లోకి తీసుకుని పొడి పొడిగా చేసి ఆరబెట్టాలి. ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఇంగువ, ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, వేరుశెనగ పప్పు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, నిలువుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పులను కలపాలి.
 
ఐదు నిమిషాలయ్యాక మామిడి తురుమును కూడా చేర్చి రెండు నిమిషాలపాటు వేయించి స్టౌను ఆర్పేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనుంచిన బియ్యం రవ్వను చేర్చి బాగా కలియబెట్టాలి. అంతే కమ్మగా, పుల్లపుల్లగా అలరించే మామిడికాయ రవ్వ పులిహోర తయార్..!! దీన్ని అలాగే వేడి వేడిగా తింటే అద్భుతంగా, వెరైటీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య

పైలట్‌కు అంతరాయం కలిగించిన లేజర్ కాంతి .. విమానం ల్యాండ్ అవుతుండగా..? (video)

విందులో మాంసం వడ్డించలేదని కేటరింగ్ సిబ్బందిపై మైనర్ల దాడి

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

Show comments