Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ అండ్ ఈజీ ఆలూ గోభీ మసాలా

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:41 IST)
క్యాలీఫ్లవర్ (గోబీ)లో అత్యధిక న్యూట్రీషన్ విలువలున్నాయి. విటమిన్ బి1, బి2, 5, 6, 9లతో పాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ కె, ప్రోటీన్స్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. వీటిని వారానికి మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. అలాంటి క్యాలీఫ్లవర్‌తో గోభీ మసాలా ఎలా చేయాలో చూద్దాం..  
 
కావల్సిన పదార్థాలు: 
కాలీఫ్లవర్ ముక్కలు : మూడు కప్పులు 
బంగాళదుంప ముక్కలు : రెండు కప్పులు 
పచ్చిబఠానీ : ఒక కప్పు  
ఆయిల్ : తగినంత 
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
ధనియా పౌడర్ : ఒకటిన్నర టీ స్పూన్ 
జీలకర్ర పొడి: ఒకటిన్నర టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు : రెండు టీ స్పూన్లు
గోభీ మసాలా : కాసింత  
ఇంగువ పొడి : ఒకటిన్నర టీ స్పూన్ 
ఉల్లిపాయ తరుగు :  ఒక కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు
టమోటో తరుగు : ఒక కప్పు
పసుపు పొడి : అర టీస్పూన్  
ఉప్పు: రుచికి సరిపడా
కారం : ఒక టీ స్పూన్
 
తయారీ విధానం :
ముందుగా తేలికపాటి పాన్‌లో జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి మరియు టమోటో ముక్కలు వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు కూడా చేర్చి తక్కువ మంటపై దోరగా వేపుకోవాలి. టమోటోలు మెత్తగా ఉడికే వరకూ వేగించి, ఆ తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేయాలి. 
 
పచ్చిబఠానీలకు కూడా వేసి మిక్స్ చేయాలి. కారం, ధనియాలపొడి, జీలకర్రపొడిని కూడా కలుపుకోవాలి. అలా పది నిముషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని హాట్ హాట్‌గా వడ్డించాలి. అంతే ఆలూ గోభీ మసాలా రెడీ.. దీన్ని రోటీ, పరోటాలకు సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizianagaram: మహిళా పోలీసులకే రక్షణ కరువు.. జుట్టు పట్టి లాగి..? (video)

వీళ్ళు భలే దొంగలురా బాబూ... చోరీకొచ్చి ఏం తీసుకెళ్లారో తెలుసా? (Video)

మాట వినని విద్యార్థులు.. గుంజీలు తీసిన హెడ్మాస్టర్ (Video)

పెళ్లయిన వారానికే మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (Video)

తండ్రిని చూడ్డానికి వచ్చి కన్నబిడ్డల్ని వదిలేసిన వెళ్లిపోయిన కసాయి తల్లి.. ఎక్కడ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

Samantha: రికార్డింగ్ డాన్స్ లా ఐటెం సాంగ్స్- బ్యాన్ చేయాల్సిన అవసరం వుందా?

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

మన సినిమాలను మనమే చంపుకుంటున్నాం.. అదే పతనానికి కారణం : అమీర్ ఖాన్

సిద్ధు జొన్నలగడ్డ... జాక్ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌

Show comments