Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకుతో సూప్ ఎలా చేయాలో తెలుసా?

మునగాకులో విటమిన్ -ఎ, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. మునగాకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతిరోజూ ఉదయం రాసుకోంటే మొటిమలు నివారించబడతాయి. ముఖం అందం పెరుగుతుంది. మునగ పువ్వులు- చిగుర్లు కూరగా

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (13:15 IST)
మునగాకులో విటమిన్ -ఎ, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. మునగాకు రసం, నిమ్మరసం కలిపి ముఖానికి ప్రతిరోజూ ఉదయం రాసుకోంటే  మొటిమలు నివారించబడతాయి. ముఖం అందం పెరుగుతుంది. మునగ పువ్వులు- చిగుర్లు కూరగా వండుకొని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 
 
ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనెను కలిపి, దానికి ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకును పాలలో మరిగించి.. ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ది కలుగుతుంది. అలాంటి మునగాకుతో సూప్ ఎలా చేయాలో చూద్దాం... 
 
కావలసిన పదార్థాలు : 
మునగాకు - రెండు కప్పులు 
క్యారెట్ తురుము - అర కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్  
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
ఉప్పు - తగినంత  
మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్ 
నూనె- రెండు టీ స్పూన్లు 
ఇంగవ పొడి - చిటికెడు 
 
తయారీ విధానం :
ఒక ప్యాన్‌లో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను చేర్చి అందులో ఐదు కప్పుల నీటిని చేర్చి.. కాసేపు ఉడికించండి. మరో బాణలితో నెయ్యి పోసి వేడయ్యాక జీలకర్ర చేర్చి.. మునగాకును చేర్చి దోరగా వేపాలి. దీనిని క్యారెట్, కొబ్బరి తురుము వేగుతున్న మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికాక ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. ఆపై బౌల్‌లోకి తీసుకుని.. అందులో కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు చేర్చి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే మునగాకు సూప్ రెడీ అయినట్లే. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments