Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు వడ ఎలా చేయాలి? హెల్త్ బెనిఫిట్స్ ఏంటి?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (18:31 IST)
పెరుగు వడను వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం ద్వారా శరీరానికి క్యాల్షియం అందుతుంది. వీటితో పాటు సోడియం, పొటాషియం, ప్రోటీన్లు, విటమిన్స్ కూడా శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు పెరుగు వడను స్నాక్స్‌గా అందించడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన బలం పొందవచ్చునని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు. ఇక పెరుగు వడను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావాల్సిన పదార్థాలు : 
పెసరపప్పు - 3 కప్పులు 
చాట్ మసాలా, జీలకర్రపొడి - చెరో స్పూన్
ఎండు మిర్చి - 4 
కారం - ఒక టీ స్పూన్ 
పచ్చిమిర్చి - 3
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
జీలకర్ర - ఒక టీ స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
కొత్తమీర తరుగు - ఒక కప్పు 
పెరుగు - నాలుగు కప్పులు 
 
తయారీ విధానం : 
ముందుగా పెసరపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. మిక్సీలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో పెసరపప్పు మిశ్రమాన్ని వడలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వడలపై తాలింపు వేసిన పెరుగు జీలకర్రపొడి, చాట్ మసాల, కారం వేసి.. కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

కొత్త జంటలు పెళ్లయిన వెంటనే ఆ పనిలో నిమగ్నం కావాలి : సీఎం స్టాలిన్ పిలుపు

Roja: పోసాని అరెస్ట్ అన్యాయం.. చంద్రబాబు, నారా లోకేష్‌పై కేసులు పెట్టవచ్చా?: ఆర్కే రోజా ప్రశ్న

మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స

Green Hydrogen Project: గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌-స్వర్ణ ఆంధ్ర విజన్-2047 వైపు తొలి అడుగు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Show comments