సమ్మర్ స్పెషల్ : హెల్దీ కర్డ్ రైస్ ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2015 (18:58 IST)
పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ వేసవిలో మజ్జిగ, పెరుగన్నం వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాంటి పెరుగుతో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చితో తయారు చేసుకుని పండ్లు కూడా చేర్చుకుంటే హెల్దీ కర్డ్ రైస్ రెడీ అయినట్లే.. ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు: 
ఉడికించిన రైస్ : రెండు కప్పులు 
పెరుగు : రెండు కప్పులు 
పాలు : రెండు కప్పులు 
నచ్చిన ఫ్రూట్స్ : ఒక కప్పు 
షుగర్ : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత 
కొత్తిమీర, కరివేపాకు తరుగు: ఒక టీ స్పూన్ 
ఆవాలు, జీలకర్ర : పోపుకు తగినంత 
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు 
బాదం తరుగు : పావు కప్పు 
 
తయారీ విధానం : 
ముందుగా ఉడికించిన రైస్‌కు చిటికెడు ఉప్పు.. పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మెదపాలి. అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.

స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు, బాదం తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. కావాలంటే క్యారెట్ తురుము కూడా చేర్చుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు : ఏపీ సీఎం చంద్రబాబు

iBomma Ravi: ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

వెనెజులా అధ్యక్షుడు మదురోను ఎలా నిర్భంధంచారో తెలుసా? (Video)

అసెంబ్లీ కౌరవ సభగా మారిపోయింది.. కేసీఆర్‌ను కాదు రాహుల్‌ను అలా చేయండి.. కేటీఆర్

కుక్క ఏ మూడ్‌లో ఉందో ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ - రెబల్ స్టార్ చిత్రాలకు ఊరట... 'రాజాసాబ్' టిక్కెట్ ధర రూ.1000

Sakshi Vaidya: నాకు పర్సనల్గా చాలా రిలేట్ అయిన పాత్ర చేశా : సాక్షి వైద్య

Raviteja: సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి తో సరదగా గోలగోల చేద్దాం : రవితేజ

ద్రౌప‌ది 2 నుంచి పీరియాడిక్ ట‌చ్‌తో సాగే తారాసుకి..సాంగ్ రిలీజ్

Aishwarya: ఐశ్వర్య అర్జున్ అందాలు హైలైట్ గా సీతా పయనం నుంచి సాంగ్ రిలీజ్

Show comments