Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలి..?

స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం దాక వేపాలి. ఆపై టమోటా తరుగు, ఎండుమిర్చి వేసి.. ద

Webdunia
సోమవారం, 22 మే 2017 (14:14 IST)
పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. పనీర్‌ను రోజు వారీ డైట్‌లో లేదా వారానికి ఓసారి తీసుకోవడం ద్వారా దంతాలు, ఎముకలు బలపడతాయి. క్యాన్సర్ కారకాలను నశింపజేయడంతో పాటు హృద్రోగ సమస్యలను దూరం చేసే పనీర్‌తో పసందైన వంటకాలను వండేయొచ్చు. ఈ క్రమంలో కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
పన్నీర్ ముక్కలు : రెండు కప్పులు 
చీజ్ - అర కప్పు 
వెల్లుల్లి, అల్లం పేస్ట్- ఒక స్పూన్ 
పంచదార - ఒక టీ స్పూన్ 
కొబ్బరి పాలు - ఒక కప్పు 
ఉల్లి తరుగు - అర కప్పు
టమోటా తరుగు- అర కప్పు 
కొద్దిమీర తరుగు- పావు కప్పు, 
ఎండుమిర్చి- మూడు 
జీలకర్ర- అర స్పూన్ 
ఉప్పు, కారం, నూనె-  తగినంత
 
తయారీ విధానం : 
స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం దాక వేపాలి. ఆపై టమోటా తరుగు, ఎండుమిర్చి వేసి.. దోరగా వేపాలి. ఐదు నిమిషాల తర్వాత కారం, ఉప్పు, పంచదార పొడి, కొబ్బరి పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. చివరిగా నేతిలో వేయించిన పనీర్ ముక్కలను అందులో చేర్చాలి. గ్రేవీ చిక్కబడేంతవరకు మంట మీద ఉంచి.. చివర్లో కొత్తిమీర గార్నిష్‌ చేస్తే కొబ్బరితో పనీర్ గ్రేవీ రెడీ.. ఈ కూరను చపాతీలను సైడిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

తర్వాతి కథనం
Show comments