Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడిపప్పుతో బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ప్రోటీన్స్, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తప్రసరణకు చాలా ఉపయోగపడుతాయి. తద్వారా క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా మధుమేహాన్ని అద

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (13:28 IST)
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ, ప్రోటీన్స్, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తప్రసరణకు చాలా ఉపయోగపడుతాయి. తద్వారా క్యాన్సర్ వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుటలో జీడిపప్పు చక్కగా పనిచేస్తుంది. ఇటువంటి జీడిపప్పుతో బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బియ్యం - 4 కప్పులు
జీడిపప్పు - 1 కప్పు
షాజీర - 1 స్పూన్
మరాఠీ మెుగ్గలు - 2
అనాస పువ్వు - 1
జాపత్రి - 1
జాజికాయ - 1
బిర్యానీ ఆకులు - 2
లవంగాలు - 6
దాల్చిన చెక్క - 1
గరంమసాల -  1/2 స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ ‌- స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 స్పూన్స్
నిమ్మరసం - 3 స్పూన్స్
కొత్తిమీర, పుదీనా తరుగు - 1 కప్పు
ఉప్పు - సరిపడా
ఉల్లిపాయ - 1
నెయ్యి - 2 స్పూన్స్ 
 
తయారీ విధానం: 
ముందుగా బియ్యాన్ని కడిగి 8 కప్పుల నీళ్లు పోసి గంటసేపు నానబెట్టుకోవాలి. బియాన్ని ఉడికించేటప్పుడు అందులో ఉప్పు, మసాల దినుసులు, నూనె వేసుకుని పలుకుగా ఉడికించి నీళ్లు వార్చేయాలి. తరువాత బాణలిలో నూనెను వేసుకుని వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి.

ఆ తరువాత ఆ మిశ్రమంలో పుదీనా, కొత్తిమీర వేసుకుని రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమంలో గరం మసాల, జీడిపప్పులు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇనుప పెనం మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో ఒక కొద్దిగా అన్నం, జీడిపప్పు మిశ్రమం వేసుకుని ఆ తరువాత నెయ్యి, ఉల్లి తరుగు చల్లుకుని ఆ గిన్నెమీద మూతపెట్టుకోవాలి. గంట పాటు చిన్నని మంటపై ఉడికించుకోవాలి. చివరగా జీడిపప్పు, కొత్తీమీర చల్లితే వేడివేడి జీడిపప్పు బిర్యానీ రెడీ. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments