Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచాలి? వాస్తు పాటించాలా...?

సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయ. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:56 IST)
సృష్టిలో ప్రాణమున్న ప్రతి ప్రాణికి వాస్తు చాలా అవసరం. మామూలుగా వచ్చే ఫలితాల కంటే వాస్తు ప్రకారం కచ్చితమైన దశ, దిశ తెలుసుకొని మనం నడుచుకుంటే అన్నీ శుభఫలితాలే వస్తుంటాయ. ఇంట్లో మొక్కలని పెంచుకునే వారు సింహ ద్వారానికి ఎదురుగా కాని, కిటికీల ప్రక్కన కాని చెట్లను పెంచకూడదు. ఇలా చేయటం వలన ఇంటి యజమానికి కీడు జరిగే ప్రమాదం వుంది. అన్ని రకాల పండ్ల చెట్లను పెంచాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఉత్తరం వైపున ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిక్కుల్లో ఈ చెట్లను పెంచాలి. 
 
ఈశాన్య భాగంలో ఎటువంటి మొక్కలు పెంచకూడదు. తులసి, బిల్వం, జమ్మి, ఉసిరి, వేప, సరస్వతి మొక్క, బ్రహ్మకమలం, రుద్రాక్ష, మరువం, దవనం, పున్నాగ, కదంబం మొదలైన దేవతా మొక్కల్ని మనం ఇష్టం వచ్చిన దిశలో పెడితే అవి పెరగవు. ఎన్ని మొక్కలు నాటినా ఫలితం వుండదు. అదే వాస్తు ప్రకారం నాటితే అవి త్వరగా నాటుకొని ఏపుగా పెరగటం ప్రారంభిస్తాయ. వీటిని ఇంటికి ఆగ్నేయ దిశగా కాంపౌండ్ వాల్‌కి కనీసం ఐదు అడుగుల దూరంలో నాటాలి.
 
తులసి మొక్కను తూర్పు ద్వారం ఇంటికి ఆగ్నేయ దిశలో కుండీలో లేదా తులసి కోటను కట్టి దాంట్లో మాత్రమే పెంచాలి. ఎట్టి పరిస్థితుల్లో నేలమీద నాటకూడదు. పడమర లేదా దక్షిణ వాకిళ్ల ఇళ్లలో తులసికోట గుమ్మానికి ఎదురుగా వుండాలి. ఉత్తర ద్వారం ఇంటికి వాయవ్యంలో తులసికోట వుండాలి. ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరాన తులసికోట కట్టకూడదు. ఈ దిశల్లో కుండీల్లో కూడా తులసిని పెట్టరాదు. ఇక ద్రాక్ష, బొప్పాయ, కొబ్బరి, మామిడి, దానిమ్మ, బత్తాయ, నారింజ, పనస, నిమ్మ, ములగ, సపోట, జామ ఇలా చాలా రకాల ఫల మొక్కలని ఇంటి ఆవరణ మొత్తంలో ఎక్కడన్నా పెంచవచ్చు. కానీ, ఉత్తర దిశలో ఖాళీ తప్పక వదలాలి. 
 
‘ఈశాన్యం భాగం ఈక బరువును కూడా మోయ కూడదు’ అంటారు. అంటే అంత తక్కువ బరువు కూడా ఆ దిశలో వుంచకూడదని అర్థం. అరటి చెట్టును దక్షిణ దిశలోనే వేసుకోవాలి. కొబ్బరిచెట్టు నైరుతీ దిశలో పెంచాలి. వీలుకాకపోతే ఆగ్నేయం, వాయవ్యంలో పెంచటం ఇబ్బందికరం కాదు. బాదం చెట్టును ఇంటి ఎదురుగా పెంచకూడదు. తమలపాకుల మొక్కను ఇంట్లో పెంచటం లక్ష్మీ ప్రదం. దక్షిణ దిశ ఈ మొక్కకు శుభం.
 
పూలకోసం పూల మొక్కల్ని కుండీల్లో పెంచుకునేవారు కుండీల్ని ఇంటికి దక్షిణంలో, పడమర, నైరుతి, ఆగ్నేయం, వాయవ్యంలో వుంచవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాలలో కుండీలను ఉంచరాదు. తులసి మొక్కను పెంచే కుండీని పూల మొక్కల కుండీల్లో కలిపి పెంచరాదు. పాలు కారే చెట్లు, ముళ్ల చెట్లు, గోరింట, జువ్వి, చింత, మర్రి, కుంకుడు, మునగ, నేరేడు, రేగు, జీడి మామిడి, పోక, అవిశ మొదలైన రకరకాల చెట్లని ఇంటికి కనీసం యాభై అడుగుల దూరంలో సపరేట్ కాంపౌండ్ వాల్ కట్టి ఆ ప్రదేశంలోనే వీటిని పెంచాలి. అంటే ఇంటి వాస్తుకి ఈ మొక్కలు పెంచే ప్రదేశం వాస్తుకి సంబంధం లేకుండా వుండాలి. దాన్లోకి వెళ్లే గేటు కూడా ప్రత్యేకంగా వుండాలి. ఇలా చేయటం వలన ఇంట్లో నివసించేవారికి మేలు జరుగుతుంది.
 
కూరగాయల మొక్కలని ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణలో తూర్పు దిశలో రావిచెట్టు, పడమరలో మర్రి చెట్టు, ఉత్తరంలో మేడి చెట్టు, దక్షిణంలో జువ్విచెట్టును పెంచరాదు. నైరుతి దిశలో రేగుచెట్టు, దానిమ్మ, సీతాఫలం వుండకూడదు. వాయవ్యంలో ఉసిరి, దేవదారు, మోదుగ, అశోక చెట్లు వుండకూడదు. ఈశాన్యంలో అశోక, జమ్మి, పొగడ, సంపంగి, మల్లె, పిప్పలి వుండకూడదు. పడమర పనస, దక్షిణాన పోకచెట్టు, కొబ్బరి చెట్టు పెంచరాదు. మోదుగ, సంపెంగ, మద్ది, గానుగ తదితర మొక్కలను  ఇంటి ప్రహరీగోడ లోపల పెంచకూడదు. 
 
ఏ రకమైన క్రోటన్ మొక్కలను ఇంటి ఆవరణలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఈతచెట్టు, జిల్లేడు, తుమ్మ, తాటి, యూకలిప్టస్ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచగూడదు. ఇంటి కాంపౌండ్ వాల్‌కి సుమారు ఆరడుగుల దూరంలో వీటిని పెంచుకోవచ్చు. బిల్వ పత్రం చెట్టును పెంచేవారు దాని మొదట్లో చిన్న శివలింగాన్ని వుంచితే ఆ ఇంటికేవన్నా తెలీని వాస్తు దోషాలుంటే అవి మటు మాయమవుతాయ. పొలాల్లో ఎటువంటి మొక్కలను పెంచాలనుకున్నా పొలంగట్టుకి తగలకుండా పెంచాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

తర్వాతి కథనం
Show comments