పండుగ రోజుల్లో మామిడి తోరణాలు ఇంటికి కట్టుకుంటే?

వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. అలా కాకుంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇం

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (15:05 IST)
వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. అలా కాకుంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో  పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది.
 
పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం నాడు లేదంటే శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతిరోజూ చేస్తే మంచిది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి.
 
స్నానం చేయకుండా, అపరిశుభ్రమైన దుస్తులతో కాళ్లు కడుక్కోకుండా పూజగదిని తెరవరాదు. దేవుళ్ల ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తరువాత దేవుళ్ల ప్రతిమలకు లేదా పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కళకళలాడితే అంతగా మన జీవితాలు కళకళలాడుతాయని పండితులు చెప్పుతున్నారు.
 
వీలైనంతవరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకానీ సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుళ్ళ ఫోటోలతో పూజామందిరాన్ని నింపడం మంచిది కాదని పెద్దల మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

హర్ష వీణపై 2 కేసులు, కాల్ డిటైల్స్ తనిఖీ చేస్తున్నాం: రైల్వేకోడూరు అర్బన్ సీఐ

తమిళనాడులో విజయ్ స్వతంత్ర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. పోల్ ఏం చెప్తోంది?

పాఠశాలల్లో విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించాలి : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments