గృహారంభానికి బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం..

Webdunia
గురువారం, 25 జూన్ 2015 (17:59 IST)
గృహ నిర్మాణానికి బుధ, గురు, శుక్రవారాలు ఉత్తమం. మాఘం వైశాఖం, కార్తీక మాసాలు మంచివని పంచాంగ నిపుణులు అంటున్నారు. విదియ, తృతీయ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి తిధులు మంచివి.
 
అలాగే నక్షత్రాల విషయానికొస్తే... రోహిణి, మృగశిర, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, పూర్వార్థం ఉత్తరాషాడ, ఉత్తరార్ధం, ఉత్తరాభాద్ర, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు అనుకూలిస్తాయి. లగ్నాల విషయానికి వస్తే.. వృషభ, సింహ, వృశ్చిక, కుంభ లగ్నాలు ఉత్తమం. అలాగే చరలగ్నాలు మేష, కర్కాటక, తుల, మకరం మధ్యమం. లగ్నాధిపతి, చతుర్ధాధిపతి, అష్టమాధిపతి పరిపూర్ణ బలం గలవారై ఉండాలి.
 
అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకుండా పంచాంగ నిపుణులను సంప్రదించి.. గృహ నిర్మాణం చేపట్టాలి. అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. అలా ఉంటే గృహ యజమానికి అరిష్టదాయకమని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. 
 
శంకుస్థాపన లగ్నానికి శుభగ్రహాల బలం ఎంతగా కలిగినప్పటికీ సూర్యుడు-అంగారకుడు-శని తృతీయ-షష్టమ-ఏకాదశ స్థానాల్లో గానీ, ఉచ్ఛ-మూల త్రికోణ- స్వక్షేత్రాలలోగానీ ఉండాలి. లగ్నానికి 4-8 స్థానాల్లో ఏ గ్రహాలు ఉండకూడదు. 
 
శంకుస్థాపనకు మొదటి, రెండు, మూడో జాములు చేయవచ్చు. కానీ నాలుగో జామున మాత్రం చేయరాదు. ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేయడం ద్వారా దోషాలు చాలావరకు తొలగి, శుభ పరిణామాలు చేకూరుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన మహిళ.. ఎక్కడ?

చెట్టుకు చీర కట్టినా దాని దగ్గరకు వెళ్లిపోతాడు: అరవ శ్రీధర్ పైన బాధితురాలు వ్యాఖ్య

Telangana : ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమకు నో చెప్పారని తల్లిదండ్రులను హత్య చేసిన యువతి

వారం రోజులు డెడ్‌లైన్.. అరవ శ్రీధర్‌పై విచారణకు కమిటీ వేసిన జనసేన

2026-27 బడ్జెట్ సమావేశాలు.. 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు- ముర్ము

అన్నీ చూడండి

లేటెస్ట్

25-01-2026 ఆదివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

అన్నవరం ప్రసాదంలో నత్త.. ఇప్పుడు ప్రసాదం కౌంటర్ వద్ద ఎలుకలు

24-01-2026 శనివారం ఫలితాలు - మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి

23-01-2026 శుక్రవారం ఫలితాలు - ర్చులు విపరీతం.. అవసరాలు వాయిదా వేసుకుంటారు...

Show comments