ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేస్తే సర్వ అరిష్టాలే!!

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (19:15 IST)
మనిషి శక్తికి ముఖ్యమైనది ఆహారం. ఆ ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. వివిధ రకాలుగా వివిధ రుచులతో ఇష్టమైన రీతిలో ఆహారాన్ని తయారు చేసుకుని కడుపారా ఆరగిస్తుంటాం. ఆ వంటకాలు ఎంతో శుభ్రంగానూ, రుచిగా.. ఆరోగ్యకరంగా కూడా ఉండాలని భావిస్తాం. 
 
అయితే ఈ ఆహారాన్ని ఏ వైపు కూర్చుని తినాలన్న విషయాన్ని ఆలోచించామా? పూర్వకాలంలో అయితే పీటలు వేసుకుని కూర్చుని భుజించేవాళ్లు. కానీ ఈ ఆధునిక కాలంలో డైనింగ్ టేబుళ్లు అవీ అంటూ ఏ దిశలో కూర్చుంటున్నామో కూడా తెలియడంలేదు. టేబుల్‌ను కూడా సరైన దిశలో అమర్చుకుని తింటే మనకు శుభాలు జరుగుతాయి.
 
తూర్పు ముఖం పెట్టి భుజించడం ద్వారా ఆయుష్షు పెరుగుతుంది. పడమర వైపు కూర్చుని భుజిస్తే ఇంట్లోని సామాను వృద్ధి చెందుతుందట. దక్షిణం వైపు కూర్చుని భుజిస్తే పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయట. అంతేకాదు, ఏ కార్యము తలపెట్టినా విజయాలే కలుగుతాయట.
 
ఉత్తరం దిక్కు చూస్తూ కూర్చుని భుజించరాదు. ఆ వైపు ముఖం పెట్టి భుజిస్తే సర్వ అరిష్టాలతో పాటు అనారోగ్యాలు వెన్నంటే ఉంటాయట. టేబుల్‌పైన అయినా సరే, పీట వేసుకుని భుజించే సమయంలోనైనా సరే ఈ దిశలలో కూర్చోవడం ద్వారా సకల శుభాలూ కలుగుతాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కదిలే బస్సులో కాలేజీ స్టూడెంట్‌ను వేధించిన పోలీస్.. చెప్పుతో కొట్టింది.. ఎవరు?

Bride and groom: పెళ్లి మండపంలో వధూవరులు లిప్ లాక్.. ఎంతకీ వదల్లేదు.. తిట్టిపోస్తున్న జనం (video)

జొమాటోలో ఆర్డర్ చేసిన బిర్యానీలో కుక్క కాలు.. వీడియో వైరల్

పెయింట్ డబ్బా మీద భార్య పడిందన్నాడు.. కానీ సుత్తితో తలపై కొట్టాడు.. కూతుళ్లు?

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

అన్నీ చూడండి

లేటెస్ట్

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

ఆదాయం పెరగాలంటే.. ధనవంతులు కావాలంటే.. చాణక్య నీతిని..?

Show comments