Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు : పడమర దిక్కు.... అనుకూల ప్రతికూలతలు

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2013 (14:10 IST)
FILE
1. పడమర పల్లముగా నున్నయోడల ధననష్టము, అనారోగ్యం, అపకీర్తి, కుటుంబమునకు సంతానమునకు అరిష్టములు ప్రతిబంధకములు వ్యవహార అపజయములు, ఆడసంతానమెక్కువగా ఉండుట ఒక్కొప్పుడు మగసంతానం లేకుండుట మొదలగునవి కలుగును.

2. ఇంటికి పడమరయందు ఎక్కువ ఖాళీ స్థలముండి తూర్పున తక్కువ ఖాళీస్థలమున్న యోడల ఆ ఇంట మగసంతతి లేకుండుట లేక తక్కువుగా యుండుట, ఆడసంతానమెక్కువగా ఉండుట, ఆర్ధిక దుస్థితి అనారోగ్యం, సంతానమున కరిష్టములు ఆడపెత్తనము మొదలగునవి సంభవించును.

3. పడమర భాగము మెరకగానున్న కీర్తిప్రతిష్టలు, ధనధాన్యాభివృద్ధి, సంతాన సౌఖ్యం, ఆరోగ్యపుష్టి, సత్ప్రవర్తన, మానసిక ప్రశాంతత దాంపత్య సౌఖ్యము వ్యవహర విజయము మొదలగు శుభములు కలుగును.

4. ఇంటికిగాని, ఖాళీస్థలమునకు గాని, దక్షిణ పడమర దిశలయందున్న స్థలములుగాని, గృహములుగాని, కొని కలుపుకొనుట అశుభప్రదము దానివలన ఆర్థిక స్థితి క్రమముగా క్షీణించును. ధననష్టము మితముగా వుండును. ఒక్కొక్కప్పుడు ప్రాణనష్టము కూడా సంభవించును. ముఖ్యముగా దక్షిణమువైపు స్థలము కొని కలుపుకొనుట మహా దోషము.

5. పడమర భాగము యొక్క ప్రభావం ముఖ్యముగా ఆ ఇంటి పురుషుల పైన మగ సంతతిపైన ముఖ్యముగా ప్రధమ సంతతిపై కీర్తి ప్రతిష్టలపై ఆర్థిక పరిస్థితిమీద చూపును.

6. ఇంటికి పడమర వైపు తక్కువఖాళీ స్థలముండిన శుభం. ఆర్ధికపుష్టి, ఆరోగ్యపుష్టి, సంతానమునకు, కుటుంబమునకు సౌఖ్యము. వ్యవహార విజయము, కీర్తిప్రతిష్ఠలు మొదలగు శుభములు కలుగును.

7. ఇంటికి తూర్పువైపున కంటె పడమర మెరకగానున్న శుభప్రదము. పైన చెప్పిన శుభఫలితములు కూడా కలుగును.

8. పడమర భాగమందు బావియుండుట దోష ప్రదము.

9. ఇంటియోక్క పడమటి - సగభాగములో పై అంతస్తు వేసిన యింటికి వాస్తుబలము కలిగి ఆ ఇంటియందుండువారికి శుభము కలుగును. యింటి యజమాని చేయు పనిలో త్వరత్వరగా అభివృద్ధి కలుగును. సుఖసంతోషములు కీర్తి ప్రతిష్టలు ఆర్దికపుష్టి కలుగును.
అన్నీ చూడండి

తాజా వార్తలు

23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకుల అత్యాచారం.. గర్భం దాల్చడంతో?

Rainfall: తెలంగాణలో కుండపోత వర్షాలు.. జనగాంలో అత్యధిక వర్షపాతం నమోదు

Kamal Haasan: డీఎంకే పొత్తుతో రాజ్యసభకు కమల్.. మైలురాయిగా రాజకీయ జర్నీ

కేసీఆర్ కుటుంబంలో మరో షర్మిలగా ఎమ్మెల్సీ కవిత : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Double Decker Buses: విశాఖ వాసులకు గుడ్ న్యూస్- త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?

24-05-2025 శనివారం దినఫలితాలు - ధనసమస్యలు ఎదురవుతాయి

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

Show comments