Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయువ్యదిశలో గృహం : హెచ్చుతగ్గుల ఫలితాలు

Webdunia
గురువారం, 24 జులై 2008 (18:36 IST)
గృహ నిర్మాణంలో ఇంటి స్థలానికి వాయువ్యమూల పెరిగి ఉన్నచో, ఆ గృహములో నివసించేవారికి అధిక వ్యయము, శత్రువులు అధికమవుతారని వాస్తు చెబుతోంది. శాంతి కరువును, భయాందోళనలు కలుగుతాయని వాస్తు శాస్త్రం వెల్లడిస్తోంది.

వాయువ్య మూల పశ్చిమ దిశతో కలిసి పెరిగినట్లయితే మనశ్శాంతి లోపించి చెడు వ్యసనాలు కలుగును. పెద్ద ఎత్తున ధన నష్టాలు కలుగును. ఉత్తరదిశతో కలిసి పెరిగినచో జీవితంలో కొంతకాలము మంచి, కొంత కాలము చెడులు సంభవించును. మరోవైపు అభివృద్ధి లోపించునని వాస్తు నిపుణులు వెల్లడిస్తున్నారు.

వాయువ్యమున పెరిగినవారికి కేవలము స్త్రీ సంతానమే కలుగుతుందని, లేక స్త్రీ సంతానమే ఉండబోదని వాస్తు చెబుతోంది. పడమర దిశతో కలిసి వాయువ్యదిశ పెరిగినచో శుభప్రదమని, ఉత్తర దిశతో కలిసి పెరిగినచో ఏవిధమైనటువంటి మంచిఫలితాలు జరుగవని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ విధంగా పెరిగినట్లైతే విపరీతంగా కష్ట, నష్టాలు దరిచేరుతాయని, వారు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుందని వాస్తు వెల్లడిస్తోంది.

అదేవిధంగా వాయువ్యమూలలో ఏ విధమైనటువైంటి పెరుగుదల లేక సమానంగా ఉన్నచో రాజకీయ పరంగా రాణింపు ఉంటుందని, వీరికి ధన విషయంలో ఎలాంటి లోటు ఉండదని వాస్తు పేర్కొంటోంది. కాగా వాయువ్య దిశలో తగ్గి ఉన్నచో ఈశాన్యం మూల పెరిగిఉండవలెనని, ఈశాన్యం పెరగకుండా వాయువ్యదిశ ఏమాత్రం తగ్గకూడదని వాస్తు శాస్త్ర నిపుణుల వాదన.

ఒకవేళ వాయువ్య భాగము పెరిగి ఆస్థలంలో నూతులు, పల్లములు ఉన్నచో యజమాని సంతానానికి కీడు జరుగుతుందని, వాయువ్య తగ్గి, ఈశాన్యం కాస్త పెరిగినా ఆ గృహంలో నివసించువారు స్థితిపరులు కాగలరు. కానీ సమాజంతో ఎలాంటి సంబంధబాంధవ్యాలు లేక ఒంటరివారవుతారని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

Show comments