Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాలెంటైన్స్ డే నాడు అమ్మానాన్నలతో గడపండంటున్న కలెక్టర్.. ఎవరు..?

ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ వాలెంటైన్స్ డేకు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన మన యువతీయుకులు ఎవరూ ప్రేమికుల దినోత్సవంగా పేర్కొనే వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్ల

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (14:51 IST)
ప్రేమికులకు షాక్ ఇస్తూ ఒక జిల్లా కలెక్టర్ వాలెంటైన్స్ డేకు సంబంధించి సంచలనాత్మక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన మన యువతీయుకులు ఎవరూ ప్రేమికుల దినోత్సవంగా పేర్కొనే వాలెంటైన్స్ డేను జరుపుకోవద్దంటూ ఉత్తర్వులిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా కలెక్టర్ జి.కె.జైన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
 
పాశ్చాత్య సంస్కృతి నుంచి అరువు తెచ్చుకున్న ప్రేమికుల దినోత్సవాన్ని పక్కనబెట్టి.. ఫిబ్రవరి 14వ తేదీన యువత తమ తల్లిదండ్రులతో గడపాలని, వారిని ప్రేమపూర్వకంగా చూసుకోవాలని ఉద్భోదించారు. ఫిబ్రవరి 14వ తేదీన మాతృపితృ పూజా దినోత్సవంగా పాటించాలని కలెక్టర్ జైన్ కోరారు.
 
ప్రతి ఇంట్లోనూ, మరీ ముఖ్యంగా విద్యాసంస్థలు, సామాజిక సేవా సంస్థలు ఆ రోజున మాతృపితృ పూజా దినోత్సవంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతీయువకులు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఆయన తీరును తప్పుబట్టగా మరికొంతమంది ఒక మంచి మార్పు కోసమే ఆయన ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారని పేర్కొంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments