2021-22లో జీడీపీ వృద్ధిరేటు 11 శాతం : విత్తమంత్రి నిర్మలా సీతారామన్

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (15:12 IST)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆ తర్వాత విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 
 
2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుంద‌ని ఈ ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆర్థిక స‌ర్వే ఈ అంచ‌నాకు వ‌చ్చింది. ఇక 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుంద‌ని కూడా చెప్పింది. 
 
కరనా కష్టకాలం తర్వాత ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ సాధార‌ణ స్థాయికి చేరుకుంటోంద‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డంతో సేవ‌లు, వినియోగం, పెట్టుబ‌డుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయ‌ని స‌ర్వే తెలిపింది.
 
గ‌తేడాది కొవిడ్ కార‌ణంగా ఒక్క వ్య‌వ‌సాయ రంగం త‌ప్ప మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవ‌లు, త‌యారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా న‌ష్ట‌పోయిన‌ట్లు ఈ స‌ర్వే తేల్చింది. ఈ ఏడాది ప్ర‌భుత్వం త‌న 3.5 శాతం ద్ర‌వ్య‌లోటు ల‌క్ష్యాన్ని చేరుకోక‌పోవ‌చ్చ‌ని కూడా ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. గ‌తేడాది -23.9 శాతానికి ప‌త‌న‌మైన వృద్ధి రేటు త‌ర్వాత మెల్ల‌గా కోలుకున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments