Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను... పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి - సోము వీర్రాజు వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: జీవీఎల్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (21:32 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు బిజెపి రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్.నరసింహారావు. సోము వీర్రాజు చెప్పినట్టుగా బిజెపి-జనసేన తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తి అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.
 
తిరుపతి ఉపఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు వైసిపి, టిడిపి సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా కేంద్రం చేస్తే వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ అయినవాళ్లు ఎప్పుడూ ఏమీ చేసింది లేదని.. బిజెపి చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
 
సీఎం జగన్‌కి వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి... ఎంపీ పోటీకి అర్హుడా అంటూ ప్రశ్నించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి  నామినేటేడ్ పోస్టులు ఇచ్చేందుకు చాలా ఉన్నాయన్నారు. జగన్ సేవ వర్సెస్ జనం సేవ దేన్ని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. విజయసాయి రెడ్డి.. సోము వీర్రాజుపై చేసిన ట్వీట్ వైసిపి భయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.  
 
21 మంది వైసిపి ఎంపీలు చేయలేనిది 22వ ఎంపీ చేయగలడా అంటూ ప్రశ్నించారు. బిజెపి అభ్యర్థి రత్నప్రభ విజయం తిరుపతి అభివృద్ధికి సోపానమన్నారు. అవినీతి గురించి వైసిపి నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments