Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు చల్లుతుంటే... టీడీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా? ఆర్కే.రోజా ఫైర్

అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నాడు మట్టి, నీటిని కళ్లకు అద్దుకుని హెలికాప్టర్ ఎక్కి చంద్రబాబు చల్లుతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? అంటూ వైకాపా మహిళా న

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (11:27 IST)
అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నాడు మట్టి, నీటిని కళ్లకు అద్దుకుని హెలికాప్టర్ ఎక్కి చంద్రబాబు చల్లుతుంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? అంటూ వైకాపా మహిళా నేత, ఎమ్మెల్యే ఆర్కే. రోజా ప్రశ్నించారు.
 
సోమవారం ఉదయం విశాఖపట్టణంలో వైకాపా ఆధ్వర్యంలో ప్రారంభమైన వంచన దీక్షలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, నీరు ఇచ్చి పోయిన ప్రధాని నరేంద్ర మోడీని విపక్షనేత వైఎస్ జగన్ నిలదీయలేకపోయారంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. 
 
నరేంద్ర మోడీ వచ్చి మట్టి, నీరు ఇచ్చిన వేళ, జగన్ అక్కడ లేరని, వాటిని రెండు చేతులతో మహా ప్రసాదంగా తీసుకున్న చంద్రబాబు ఓ దద్దమ్మ అయితే, ఆయన పక్కనే ఉన్న దేవినేని మరో దద్దమ్మని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేస్తున్న వేళ, ప్రతిపక్ష నాయకుడిని పిలవకుండా వాళ్లింటి పేరంటంలా చేసుకుని సిగ్గు లేకుండా ప్రవర్తించిన నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. 
 
టీడీపీ వారు చేసిన పాపాలు పండే సమయం వచ్చిందని రోజా జోస్యం చెప్పారు. వంచన చేసిన వారే ధర్మపోరాటం అంటూ మరో కుట్రకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకు జరుపుతున్న చంద్రబాబు మోసపు దీక్షల గురించి ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments