Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర శాసనసభ రద్దు : సీఎం కేసీఆర్ ప్లాన్?

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (14:17 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది ఎన్నికలు జరగాల్సివుంది. అయితే, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీకి చేరారు. 
 
ఇపుడు ఈయనే ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికలు తెరాసకు అత్యంత కీలకంగా మారాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలుపొంది విజయం సాధించాలన్న పట్టుదలతో బీజేపీ పరితపిస్తుంది. ఈ క్రమంలో తెరాసతో పాటు ఇతర విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. 
 
మరోవైపు, సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు పదుపెట్టారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును అడ్డుకోవాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. దీంతో మునుగోడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన భాలిస్తున్నట్టు సమాచారం. 
 
సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశం, టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నారనే అనుమానాలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. 
 
అలాగే సామాజిక సంక్షేమ పథకాలపై మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. ముందుగా అసెంబ్లీ రద్దుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి కూడా.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments