Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-2 ప్రయోగంలో ఆ రెండు నిమిషాలు ఏం జరిగింది..? శివన్ ను మోదీ ఏం చేశారో చూడండి(Video)

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (11:12 IST)
130 కోట్లమంది భారతీయుల స్వప్నం సాకారమయ్యే సమయమది. 50 కోట్లమందికి పైగా భారతీయులు ఎంతో ఆసక్తితో ప్రసార మాథ్యమాలు, సామాజిక మాథ్యమాలకు అతుక్కుపోయి అర్థరాత్రి వేళ కూడా ఆసక్తిగా తిలకిస్తున్న ఘట్టమది.

చరిత్ర సృష్టించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేరువలో ఉన్న సమయంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం. అసలు 13 నిమిషాల వరకు సక్రమంగా నడుస్తున్న చంద్రయాన్-2 లోని ప్రజ్ఙాన్, విక్రమ్ రాడార్లలో ఉన్నట్లుండి సాంకేతిక లోపం తలెత్తింది.
 
రెండు నెలల పాటు చంద్రయాన్-2 అతివేగంగా చివరి ఘట్టానికి చేరుకున్న సమయం అర్థరాత్రి 1 గంట 55 నిమిషాలు. ఇక చంద్రుడికి దక్షిణం వైపు విక్రమ్, ప్రజ్ఙాన్‌లు ల్యాండ్ అవుతాయి. ఖచ్చితంగా చంద్రుడిపై ఉన్న సమాచారం మొత్తం సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. కానీ ఉన్నట్లుండి సాంకేతిక సమస్య ప్రారంభమైంది. ల్యాండింగ్‌కు 13 నిమిషాల ముందు వరకు సరైన పద్ధతిలో వెళుతున్న రాడార్లలో ఉన్నట్లుండి సాంకేతిక సమస్యే కొంపముంచింది.
 
అంతేకాదు చివరి రెండు నిమిషాల్లో సరిగ్గా లక్ష్యానికి 300 మీటర్ల దూరంలో విక్రమ్, ప్రజ్ఙాన్ రాడార్లు ల్యాండ్ అయ్యాయి. రాడార్లలోని వ్యవస్ధతో ఇస్రోకు సిగ్నల్ పూర్తిగా తెగిపోయాయి. అయితే ఎంతోమంది శాస్త్రవేతలు కష్టపడి శ్రమించి చివరివరకు ప్రయత్నించడంపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.

ప్రయత్నం మనది ఫలితం దేవుడిది అంటూ నిరుత్సాహంతో ఉన్న శాస్త్రవేత్తలను ఓదార్చారు. గతంలో కూడా చంద్రయాన్ -1 ఇలాంటి సమస్యే తలెత్తింది. చంద్రయాన్-2 కూడా ఇదే పరిస్థితి తలెత్తడం శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేస్తోంది. అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమవుతున్న సమయంలో సాంకేతిక లోపం ఇస్రో శాస్త్రవేత్తలను ఎంతగానో నిరుత్సాహపరుస్తోంది. 
 
ఐతే స్థైర్యం, ధైర్యం కోల్పోవద్దని ఇస్రో చైర్మన్ శివన్‌ను వెన్నుతట్టి ఆలింగనం ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పడంతో అక్కడివారంతా అలా మౌనంగా చూస్తూ వుండిపోయారు. మోదీ ఇచ్చిన స్థైర్యం, ధైర్యంతో మళ్లీ కొత్త ఉత్సాహంతో ఇస్రో ముందడుగు వేస్తుందని ఆశిద్దాం. చూడండి వీడియో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments