తిమింగ‌లం లాలాజలం కూడా వ్యాపార‌మే, ఎన్ని కోట్లో!!

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (09:56 IST)
కాదేదీ దొంగ వ్యాపారానికి అన‌ర్హం అన్న‌ట్లు... కొంద‌రు పెద్ద దొంగ‌లు తిమింగ‌లం లాలాజ‌లాన్ని కూడా స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఇదే కేసులో గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు 8 మందిని ప‌ట్టుకున్నారు. వారు నిషేధిత తిమింగలం అంబర్ గ్రీస్ (లాలాజలం) ని విక్ర‌యించే ముఠాగా పేర్కొన్నారు.

తిమింగ‌లం లాలాజ‌లాన్ని అంబ‌ర్ గ్రీస్ అంటార‌ట‌. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టి అమ్మేస్తున్నార‌ట ఈ ముఠా. ఇలా విక్రయించే ముఠాను పట్టుకున్న నరసరావుపేట పోలీసులు వారి నుంచి ఏడు కోట్ల  రూపాయల విలువ చేసే 8.25 కేజీల అంబర్ గ్రీస్ స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు బైకులు,ఎనిమిది సెల్ ఫోన్ లు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం : నటి భూమిక

మా హీరో కోట్లు ఇచ్చినా తప్పు చేయడు... రూ.40 కోట్ల వదులుకున్న పవర్ స్టార్

అనసూయకు గుడికడతాం... అనుమతి ఇవ్వండి... ప్లీజ్

'రణబాలి'గా విజయ్ దేవరకొండ.. ఏఐ వాడలేదంటున్న దర్శకుడు

చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అంటే అర్థం వేరు .. ఓ పెద్దాయన అలా ప్రవర్తించారు : గాయని చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments